Naga Vamsi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలలో నాగవంశీ ఒకరు. మామూలుగా ప్రొడ్యూసర్ల పేర్లు బయటకు పెద్దగా వినిపించవు. అప్పట్లో ప్రొడ్యూసర్స్ గురించి ఎక్కువమంది ప్రస్తావించేవాళ్ళు. ప్రొడ్యూసర్స్ అంటే టక్కన చాలామంది గౌరవంగా మాట్లాడే పేరు డి రామానాయుడు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించిన పేరు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు సినిమాలో నిర్మిస్తూ ఉంటారు. ఎంతోమంది కొత్త దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత దిల్ రాజుకు ఉంది.
ఇకపోతే ప్రస్తుతం గట్టిగా వినిపించే పేరు సూర్యదేవర నాగ వంశీ. సోషల్ మీడియాలో కూడా ఒకప్పుడు బాగా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. కానీ కొన్ని కారణాల వలన సోషల్ మీడియాకి దూరమైపోయాడు నాగ వంశీ. సోషల్ మీడియాలో ఉన్న కూడా అవసరం మేరకు మాత్రమే మాట్లాడుతాడు. ఒకప్పుడు అవతార్ సినిమా గురించి చేసిన కామెంట్స్ కూడా తీవ్రంగా ట్రోల్ అయ్యేలా చేశాయి.
ప్రస్తుతం నాగ వంశీ మాస్ జాతర అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ప్రమోషన్స్ చేస్తుంది చిత్ర యూనిట్. ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు భాను బాగా వరకు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగవంశం గురించి ఆసక్తికర విషయాలను రివిల్ చేశారు.
వంశీ గారు చాలా అగ్రెసివ్ గా కనిపిస్తారు కానీ సెట్స్ లో ఎలా ఉంటారు అని ఒక ప్రముఖ జర్నలిస్ట్ దర్శకుడు భానును అడిగారు. ఆయన మామూలుగా చాలా సాఫ్ట్. కానీ అగ్రెసివ్ అనేది ఎందుకంటారు తెలియదు. బహుశా అడిగే ప్రశ్నను బట్టి అలా బిహేవ్ చేస్తారేమో తెలియదు. ఆయన చాలా సాఫ్ట్ బేసిగ్గా అలానే చాలా మంచి వ్యక్తి కూడా.
కానీ అది బయటకు వేరేలా వెళ్తూ ఉంటుంది. అని ఆయన మాత్రం చాలా పాజిటివ్ పర్సన్ అని నిర్మాత నాగ వంశీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. అయితే సినిమా చేయటం వలన అలా చెప్పాడా లేకుంటే నిజంగానే వంశీ పాజిటివ్ గా కూల్ గా ఉంటారా అనేది చాలామందికి వస్తున్న డౌట్.
రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయిపోయాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా మంచి ఆసక్తిని రేపింది. ఇప్పటివరకు రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వలేదు. ఆ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు వర్కౌట్ అయ్యేటట్లు ఉంది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో అక్టోబర్ 31న తెలుస్తుంది. కానీ రవితేజ కెరియర్ లో ఇప్పటివరకు బెస్ట్ పోలీస్ క్యారెక్టర్ అంటే విక్రమ్ సింగ్ రాథోడ్.
Also Read: Bison: బైసన్ సినిమాపై ముఖ్యమంత్రి ప్రశంసలు, తెలుగు వాళ్ళు నేర్చుకోవాలి