OTT Movie : కొన్ని సిరీస్ లు సైలెంట్ గా వచ్చి సంచలనాలు సృష్టిస్తుంటాయి. గ్రిప్పింగ్ థ్రిల్లర్ తో వచ్చిన ‘ఢిల్లీ క్రైమ్ సీజన్’ ఆడియన్స్ ని అలానే మెప్పించింది. ఇది వరకే రెండు సీజన్ లతో వచ్చిన ఈ అంచనాలను మించిపోయింది. మూడో సీజన్ వచ్చే నెల 13 నడిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. ప్రేక్షకులు కూడా దీని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొదటి సీజన్ నిర్భయ కేసుతో మొదలై, రెండో సీజన్ ముసలి వాళ్ళను చంపే చద్ది గ్యాంగ్ తో మొదలవుతుంది. ఈ సీజన్ లలో ఆసక్తికరమైన పోలీసు ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉన్నప్పటికీ, వెనుకబడిన గిరిజనులను నెరస్తులుగా చూపించే తీరుకు కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే ఈ సిరీస్ లో వర్తిక చతుర్వేది (షెఫాలీ షా) Dcp పాత్రలో వన్ విమెన్ షో అనే చెప్పుకోవాలి. ఇది ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
‘ఢిల్లీ క్రైమ్ సీజన్ 2’ (Delhi crime series season 2) 2022లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో షెఫాలీ షా, రసిక దుగల్, రాజేష్ తైలాంగ్, ఆదిల్ హుస్సేన్ నటించారు. ఇది 2019 లో వచ్చిన సీజన్ 1కి సీక్వెల్. తనూజ్ చోప్రా దీనిని డైరెక్ట్ చేశారు. ఈ సీజన్‌లో 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. సీజన్ 1 నిర్భయ కేస్ ఆధారంగా ఉండగా, సీజన్ 2లో ఢిల్లీలో జరిగిన ‘చద్దీ బనియాన్ గ్యాంగ్’ కేస్‌పై ఫోకస్ చేశారు. ఐయండిబిలో దీనికి 7.1/10 రేటింగ్ ఉంది.
ఢిల్లీలో ఒక ఇంట్లో ముగ్గురు వృద్ధులు భయంకరంగా హత్యకి గురవుతారు. శవాలు కట్ చేసి, ఆ ప్రాంతం రక్తంతో తడిచిపోయి ఉంటుంది. పబ్లిక్ బాగా భయపడతారు. DCP వర్తిక చతుర్వేది దగ్గరికి ఈ కేస్ వస్తుంది. వాళ్లు సీసీటీవీ, ఫోరెన్సిక్ అంతా చెక్ చేస్తారు. ఇంతలో మరో ఇంట్లో మళ్లీ వృద్ధులు హత్యకి గురవుతారు. ఇది చద్దీ బనియాన్ గ్యాంగ్ పని అని అనుమానిస్తారు. వీళ్ళు రాత్రి చద్దీ, బనియాన్ ధరించి ఇంట్లోకి వెళ్లి, డబ్బు దొంగిలించి, వృద్ధులను చంపేస్తుంటారు. వర్తిక రిటైర్డ్ పోలీస్ వీరెన్ చద్దాని ఈ కేసు గురించి పిలుస్తుంది. అతను ఈ గ్యాంగ్ కేసుల్లో బాగా ఎక్స్‌పర్ట్. కానీ చద్దా పాస్ట్‌లో కరప్షన్ కూడా ఎక్కువే చేశాడు. ఈ టీమ్ సీసీటీవీ, మొబైల్ ట్రాక్ చేసి గ్యాంగ్ మెంబర్స్‌ను పట్టుకుంటుంది.
Read Also : పిల్ల రూపంలో వచ్చే పిశాచి భయ్యో… డోర్ తీశారో దరువే… ఒంటరిగా చూడకూడని హర్రర్ మూవీ
ఈ గ్యాంగ్ లో అందరూ పూర్ ఫ్యామిలీ నుండి వచ్చినవాళ్లు. డబ్బు కోసం క్రైమ్ చేస్తుంటారు. ఈ గ్యాంగ్ లీడర్ ఒక మహిళ అని తెలుస్తుంది. ఆమె చాలా క్రూరమైనది. ఆమె మహిళలు, పిల్లలను కూడా టార్చర్ చేసి చంపుతుంటుంది. భర్తని వదిలేసి ప్రియుడితో ఉంటుంది. అయితే అక్కడ ఇంతలో మరో మర్డర్ జరుగుతుంది. ఒక వృద్ధ మహిళని అదే ఫార్మాట్ లో చంపుతారు. పోలీసులు ట్రాక్ చేస్తే, వాళ్ళు ఒక చోట ఉన్నట్లు సమాచారం వస్తుంది. పోలీసులు చేస్ చేసి వాళ్ళల్లో కొందరిని పట్టుకుంటారు. కానీ లీడర్ ఎస్కేప్ అవుతుంది. వర్తిక టీమ్ ఆ లీడర్‌ను ట్రాక్ చేస్తుంది. క్లైమాక్స్ మరింత ఇంటెన్స్ గా ఉంటుంది. చివరికి వర్తిక ఆ గ్యాంగ్ లీడర్ ని పట్టుకుంటుందా ? ఈ ఎండింగ్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.