Actor Sudhakar: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు సుధాకర్(Sudhakar)ఒకరు ఈయన కెరియర్ మొదట్లో తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగారు. అప్పట్లో రజినీకాంత్ ను మించి క్రేజ్ సొంతం చేసుకున్న సుధాకర్ ఊహించని విధంగా తమిళ సినిమాల నుంచి బయటకు వచ్చారు. ఇలా తమిళం నుంచి బయటకు వచ్చిన ఈయన తెలుగులో హీరోగా కాకుండా కమెడియన్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా తన కామెడీతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించిన సుధాకర్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.
ఈ విధంగా సుధాకర్ సినిమాలకు దూరం కావడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈయన ఉన్నఫలంగా సినిమాలకు దూరం కావడానికి గల కారణాలను ఆయన కుమారుడు బెన్నీ (benny) తెలియజేశారు. బెన్నీ ఆలోచన(Aalochana Movie) అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కాకపోయినా కీలక పాత్రలో బెన్నీ నటించారు. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ విడుదల అయింది, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న బెన్ని తండ్రి సుధాకర్ సినిమాలను వదిలేయడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా బెన్నీ మాట్లాడుతూ సంక్రాంతి సినిమా తర్వాత నాన్న పూర్తిగా అవకాశాలు కోల్పోయారని, ఆ సమయంలోనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని తెలిపారు.
ఇలా క్రమక్రమంగా నాన్నకు అవకాశాలు తగ్గిపోవడంతో మెంటల్గా డిసప్పాయింట్ అయ్యారని తెలియజేశారు. అయితే ఇటీవల తమిళ సినిమాలో నటించడం కోసం నిర్మాతలు నాన్నని సంప్రదించారు కానీ నాన్న మాత్రం వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలిపారు. నేను సినిమాలలో నటించను కానీ, మా అబ్బాయికి అవకాశం ఇవ్వండని ఒక డైలాగ్ మాత్రం చెబుతున్నారని బెన్నీ తెలిపారు. ఇలా నాన్నకు అవకాశాలు వచ్చినప్పటికీ రిజెక్ట్ చేస్తున్నారని అలా రిజెక్ట్ చేయడానికి కారణం ఫిజికల్ గా మెంటల్ గా ఆయన సినిమాలు చేయటానికి సిద్ధంగా లేరని తెలిపారు.
ఒకానొక సమయంలో క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సుధాకర్ పలు అనారోగ్య సమస్యలకు కూడా గురి అయ్యారని తెలుస్తుంది. ఈయన బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా కొన్ని నెలలపాటు కోమాలోనే ఉండిపోయిన విషయాన్ని కూడా బెన్నీ బయట పెట్టారు. ఇలా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలోనే సుధాకర్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఆయన వారసుడిగా బెన్నీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. మరి బెన్ని ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.
Also Read: డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి బయటపెట్టిన అనిల్ రావిపూడి.. కామెడీకి బ్రేక్ పడినట్లేనా?