E-Paper
Advertisement

Kannada Actor Darshan: రెణుకాస్వామి హత్య కేసులో కొత్త మలుపు..దర్శన్ గన్ లైసెన్స్ సస్పెన్షన్‌పై స్టే..!

Kannada Actor Darshan: రెణుకాస్వామి హత్య కేసులో కొత్త మలుపు..దర్శన్ గన్ లైసెన్స్ సస్పెన్షన్‌పై స్టే..!
Advertisement

Kannada Actor Darshan: కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీప కు సంబంధించిన రెణుకాస్వామి హత్య కేసులో తాజాగా కోర్టు నుంచి ఊరట లభించింది. ఈ కేసులో విచారణ ఎదురుచూస్తూ జైలులో ఉన్న దర్శన్‌కు చెందిన గన్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

గన్ లైసెన్స్‌ను సస్పెండ్ ..!

రెణుకాస్వామి అనే 33 ఏళ్ల యువకుడు హత్యకు.. గురైన ఘటనలో దర్శన్‌ను 2024 జూన్ నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్ ప్రధాన నిందితుల్లో ఒకరుగా ఉన్నారు. అరెస్ట్ అయిన తొమ్మిది నెలల తర్వాత, అంటే 2025 జనవరిలో, పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దర్శన్ గన్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదేశాలపై మాత్రమే స్టే..!

Advertisement

ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దర్శన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం, గన్ లైసెన్స్ సస్పెన్షన్‌పై స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో దర్శన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. అయితే ఇది కేసులో తుది తీర్పు కాదని, కేవలం గన్ లైసెన్స్ సస్పెన్షన్ ఆదేశాలపై మాత్రమే స్టే అని కోర్టు స్పష్టం చేసింది.

ఈ హత్య కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ, ఇంకా 15 మంది ఇతరులపై కూడా కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ కుట్ర, అక్రమంగా గుంపుగా చేరడం, కిడ్నాప్, హత్య వంటి తీవ్రమైన అభియోగాలు నిందితులపై నమోదు చేశారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినందుకు కోపగించుకున్న దర్శన్ మరియు అతని అనుచరులు రెణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరులోని ఒక షెడ్‌కు తీసుకెళ్లారని ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

చార్జ్ షీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, అక్కడ అతడిని చెప్పులతో, చెక్క దండతో కొట్టారని, తీవ్ర గాయాల కారణంగా అతడు మృతి చెందాడని ప్రాసిక్యూషన్ తెలిపింది. అలాగే ఈ నేరాన్ని ఒప్పుకునేందుకు కొంతమంది నిందితులకు డబ్బు ఇచ్చినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులు తమపై ఉన్న ఆరోపణలను ఖండించారు. తాము నిర్దోషులమని చెబుతూ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతుండగా, కోర్టు తుది తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

ALSO READ: Rashmika – Vijay: వామ్మో కట్నం కింద రష్మిక అన్ని కోట్లు ఇస్తోందా..ఎస్టేట్ తో పాటూ బోలెడు ఆస్తులు కూడా!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×