దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే, ఉత్తరాది రాష్ట్రాల్లో రైలు ప్రయాణాలు అత్యంత అధ్వాహ్నంగా ఉంటాయి. ఏ రైలు చూసినా ప్రయాణీకులతో కిటకిటలాడుతుంది. ఏ టికెట్ టికెట్ తీసుకొని ఏ బోగీలో ఎక్కుతారో తెలియదు. రైల్లో ఎక్కడపడితే అక్కడే కూర్చుంటారు. బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంఫుల్ గా తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేసినప్పటికీ, మరికొంత మంది సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే..
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో వైరల్ అయ్యింది. కంటెంట్ క్రియేటర్ విశాల్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లకు వినోదాన్ని పంచుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను సుమారు 8 లక్షల మంది చూశారు. ఈ వీడియోలో ఓ ప్రయాణీకుడు టాయిలెట్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. లోపల తన వెంట తెచ్చుకున్న వస్తువులను భద్రపర్చుకుంటాడు. వాష్ రూమ్ లో పరుపు వేసి తన కాళ్లను వాష్ బేషిన్ మీద ఉంచి హ్యాపీగా బెడ్ రూమ్ లా మార్చకున్నాడు. కోచ్ బయటి వైపు తన మంచాన్ని కూడా బిగించాడు. లోపల హ్యాపీగా కూర్చొని ప్రయాణిస్తున్నాడు.
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తే, మరికొంత మంది సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇతరులు రైల్లో నిలబడటానికి ఇబ్బంది పడుతుంటే, అతడు మాత్రం దర్జాగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “రైల్వే అధికారులు కచ్చితంగా అతడిని నెక్ట్స్ స్టేషన్ లో దింపేయడం పక్కా” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. అటు ఈ ఘటన తీవ్రమైన రైల్వే రూల్ ఉల్లంఘనగా మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రయాణ సమయంలో ప్రయాణీకులు ఉపయోగించుకోవాల్సిన వాష్ రూమ్ ను బ్లాక్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తి లోపలి నుంచి వాష్ రూమ్ ను లాక్ చేస్తే, టాయిలెట్ కు వెళ్లాల్సిన ప్రయాణీకుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రైల్వే వాష్ రూమ్ ను బ్లాక్ చేయడంతో పాటు ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించినందుకు గాను, అతడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైల్వే అధికారుల ఉదాసీనత కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. అటు ఈ వీడియోపై రైల్వే అధికారులు ఇంకా రియాక్ట్ కాలేదు.
Read Also: కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. ఆ రూట్ లో రైళ్లు పెంచాలని ప్రయాణీకుల డిమాండ్!
Read Also: 24 గంటలుగా బోగీలోనే నరకయాతన.. నీళ్లు లేవు, టాయిలెట్‌కు వెళ్లే దారీ లేదు!