E-Paper
Advertisement

కోలీవుడ్‌లో మరో మైండ్ బ్లోయింగ్ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్‌కు ధనుష్ గ్రీన్ సిగ్నల్!

కోలీవుడ్‌లో మరో మైండ్ బ్లోయింగ్ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్‌కు ధనుష్ గ్రీన్ సిగ్నల్!
Advertisement

Dhanush Siva: కాంబినేషన్ ..ఇండస్ట్రీలో ఈ పదానికి ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబోస్ అనౌన్స్ అయినప్పుడు వచ్చే హైప్ అంతా ఇంతా కాదు.ఈ క్రమంలోనే తమిళ నాట మరో క్రేజీ కాంబోకి రంగం సిద్దమవుతుందని తెలుస్తుంది. అవును తనదైన వెర్సటైల్ యాక్టింగ్ తో దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.

బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ ‘కంగువ’

ధనుష్ ప్రస్తుతం చేతినిండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, దర్శకుడు శివ చెప్పిన ఒక వినూత్నమైన లైన్ నచ్చడంతో ధనుష్ ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు శివ గతంలో కార్తీతో ‘సిరుతై’, అజిత్ తో ‘వీరమ్’, ‘వేదాళం’, ‘విశ్వాసం’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించారు. అయితే ఈ  సూర్య కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ సంగతి తెల్సిందే.

శివ నెక్స్ట్ ధనుష్ తో నేనా ?

Advertisement

ఇక  ఆ సినిమా రిజల్ట్ తర్వాత గ్యాప్ తీసుకున్న శివ మళ్లీ అజిత్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అజిత్ ప్రస్తుత షెడ్యూల్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమయ్యేలా కనిపించడంతో, శివ తన తదుపరి కథను ధనుష్ కి వినిపించి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరకెక్కించడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగినట్లు సమాచారం. తెలుగులో ‘పుష్ప’, ‘శ్రీమంతుడు’, ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు కోలీవుడ్ మార్కెట్ పై గట్టిగా ఫోకస్ చేసినట్టే కనిపిస్తుంది.

also read :రుక్మిణి వసంత్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్.. నాని బ్యానర్‌లో సాలిడ్ ఛాన్స్!

Advertisement

ఇప్పటికే తమిళంలో అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెల్సిందే.. ఇప్పుడు అదే జోరుతో ధనుష్, శివ కాంబోను సెట్ చేసి మరో భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది.

2027 జనవరి నుంచి మొదలు 

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా కోసం ధనుష్ కి ఉన్న క్రేజ్ ని, శివకు ఉన్న మాస్ పల్స్ ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధమైనట్లు చెప్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుంది అనే దానిపై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ధనుష్ తన ప్రస్తుత కమిట్‌మెంట్స్ అన్నింటినీ పూర్తి చేసుకుని, 2027 జనవరి నుంచి ఈ కొత్త సినిమాకు కాల్ షీట్స్ కేటాయించినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

also read :అభిమానులపై మళ్లీ ఫైర్ అయిన బాలయ్య.. విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్!

సాధారణంగా ధనుష్ సినిమాలు కంటెంట్ ఓరియెంటెడ్ గా సాగుతుంటాయి, అదే సమయంలో శివ సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండి ఉంటాయి. మరి వీరిద్దరి కలయికలో రాబోయే సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ గురించి ఇండస్ట్రీలో విపరీతమైన ప్రచారం జరుగుతున్నప్పటికీ, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ గానీ, లేదా హీరో ధనుష్ టీమ్ గానీ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు .సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలపై ఎలాంటి అనౌన్స్ మెంట్ వస్తుందో !

Related News

సాయి పల్లవి కెరీర్‌లో మరో బిగ్ టర్నింగ్.. భారీ సినిమాలో ఛాన్స్!

అమ్మగా ప్రమోట్ అయిన టాలీవుడ్ బ్యూటీ..పాప ఫోటోలు వైరల్!

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత !

ప్రేమలో మోసపోయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే!

పావలా శ్యామల మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ వైరల్!

మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు ఓటీటీ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కు పండగే!

అభిమానులకు లైఫ్‌టైమ్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్!

నటి పావలా శ్యామల మృతి.. ఆమె కూతురు ఎక్కడుంది?

Big Stories

Advertisement
×