Michael Jackson Biopic:మైఖేల్ జాక్సన్ ..పాప్ ప్రపంచానికి రారాజు.ఇక ఆయనకు మాత్రమె సొంతమైన మూన్‌వాక్ కి ఇప్పటికీ కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అలాంటి లెజెండ్ జీవిత కథతో తెరకెక్కిన ‘మైఖేల్’ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.అవును..థియేటర్లలో చూసిన వాళ్లు మరోసారి చూడాలని, మిస్ అయిన వాళ్లు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
ఆగస్టు 29 నుంచి జియోహాట్‌స్టార్‌లోని పీకాక్ హబ్లో స్ట్రీమింగ్
మైఖేల్ జాక్సన్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29 నుంచి ఈ సినిమాను జియోహాట్‌స్టార్‌లోని పీకాక్ హబ్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దం అయింది.ఇక ఈ సినిమాని ఇంగ్లీష్‌తో పాటు హిందీలో కూడా అందుబాటులోకి తీసుకు వస్తుండటంతో మురిసిపోతున్నారు ఇండియన్ మూవీ లవర్స్.
ఇక మైఖేల్ జాక్సన్ పాత్రలో నటించింది ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ అన్న సంగతి తెల్సిందే.అచ్చం మైకేల్ ని పోలి ఉండేలా ఉండే జాఫర్ ని చూసి మళ్ళీ మైకేల్ మళ్ళీ తిరిగివచ్చాడా అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు మైకేల్ అభిమానులు.ముఖ్యంగా సినిమాలో జాఫర్ లుక్స్, బాడీ లాంగ్వేజ్,అన్నిటి కన్నా మించి డాన్స్ లో మైకేల్ ని గుర్తుకు తెచ్చాడు జాఫర్.ఇక సినిమాలో జాఫర్ చేసిన మూన్ వాక్ సీన్స్ అయితే టాప్ నాచ్.
దర్శకత్వం వహించింది ఆంటోయిన్ ఫుక్వా
ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించింది ఆంటోయిన్ ఫుక్వా ..ఈయనకి యాక్షన్ సినిమాలు తీయడంలో మంచి పేరు ఉంది కూడా. ఇక సినిమా విషయానికి వస్తే . చిన్నప్పటి నుంచి ప్రపంచం మొత్తం పాప్ కింగ్‌గా ఎలా ఎదిగాడు.. ‘జాక్సన్ 5’ రోజుల నుంచి సొంత గుర్తింపు ఎలా తెచ్చుకున్నాడు.. ‘Thriller’, ‘Billie Jean’, ‘Beat It’, ‘Smooth Criminal’, ‘Black or White’ లాంటి పాటలతో ఎలా చరిత్ర సృష్టించాడు.. ఇవన్నీ ఈ సినిమాలో చూపించాడు ఆంటోయిన్.అయితే పాప్ కింగ్ ఎదుగుదలతో పాటు పడ్డ కష్టాలు,ఎదురైన సమస్యలు, పడిన అవమానాలు ఈ సినిమాలో చూపించడం విశేషం.
ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో !
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బయోపిక్‌లకు మంచి క్రేజ్ ఉంది. ‘Bohemian Rhapsody’లో ఫ్రెడ్డి మెర్క్యురీ కథ, ‘Elvis’లో ఎల్విస్ ప్రెస్లీ జీవితం, ‘Rocketman’లో ఎల్టన్ జాన్ ప్రయాణం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో తెల్సిందే. ఇప్పుడు అదే లిస్టులో ‘మైఖేల్’ కూడా చేరిపోయింది. మ్యూజిక్ అంటే ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా ఓ ట్రీట్‌లా ఉంటుందనిచెబుతున్నారు పాప్ కింగ్ ఫ్యాన్స్.
చూడాలి మరి ఆగస్టు 29 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో !
He turned the moonwalk into a permanent flex.
Celebrate Michael Jackson's birthday with Michael, premiering 29th August on the Peacock Hub on JioHotstar.
Available in English & Hindi. pic.twitter.com/HXQxh8clWr
— JioHotstar (@JioHotstar) July 28, 2026
also read :అభిమానులకు లైఫ్‌టైమ్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్!