Nani’s Wall Poster: టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా ఒక విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా, ఓటీటీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చాక మాత్రం సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఇళ్ళల్లో కూర్చుని సినిమా చూసిన ఆడియన్స్ ఇంత మంచి సినిమాను థియేటర్ లో మిస్ అయ్యామే అని తెగ బాధపడిపోతుంటారు. గతేడాది తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి క్రేజీ వైబ్స్ క్రియేట్ చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న కల్ట్ క్లాసిక్ చిత్రం ‘దండోరా’.
సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో, కుల వ్యవస్థ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంతో మురళీకాంత్ దేవసోత్ దర్శకుడిగా మొదటిసారే మంచి పేరు తెచ్చుకున్నాడు.బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాలేకపోయినా ఒక దర్శకుడిగా మురళీకాంత్ టాలెంట్‌కు మాత్రం ఇండస్ట్రీలో నూటికి నూరు మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌కు టాలీవుడ్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ దక్కినట్లు ఫిలింనగర్ సర్కిల్స్ గట్టిగా కోడై కూస్తున్నాయి.
తనదైన సహజ నటనతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ కొడుతూ నేచురల్ స్టార్‌గా దూసుకుపోతున్న నాని, కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను స్థాపించి కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా సరికొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేయడం నాని స్టైల్. గతంలో ఆయన ప్రొడ్యూస్ చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘అ!’, ఆ తర్వాత వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ ఫ్రాంఛైజీలు, రీసెంట్‌గా వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాలు ఈ బ్యానర్ బ్రాండ్ వాల్యూను స్కై హైకి తీసుకెళ్లాయి. కొత్త ప్రతిభను వెండితెరకు పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నాని, ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం దండోరా ఫేమ్ మురళీకాంత్‌ను లైన్లోకి దించినట్లు తెలుస్తుంది. మురళీకాంత్ చెప్పిన ఒక డిఫరెంట్ అండ్ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ నానికి విపరీతంగా నచ్చేయడంతో ఆల్రెడీ ప్రాజెక్ట్ లాక్ అయిపోయిందని టాక్.
also read :బాలయ్య సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా రాజశేఖర్?.. కొరటాల శివ స్కెచ్ మామూలుగా లేదుగా!
ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కథలో ఉండే ఎమోషన్స్, డ్రామాను నెక్స్ట్ లెవెల్‌లో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు మురళీకాంత్ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. అయితే ఈ సినిమాలో నాని మార్క్ కంటెంట్‌తో పాటు ఒక అదిరిపోయే క్యాస్టింగ్ సెట్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా కన్నడ క్రష్, సప్త సాగరదాచే ఎల్లో ఫేమ్ రుక్మిణి వసంత్‌ను దాదాపు ఖరారు చేసినట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో వరుస క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న రుక్మిణికి, తెలుగులో ఈ వాల్ పోస్టర్ సినిమా ఆఫర్ రావడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ కానుంది. ఆల్రెడీ ఈ బ్యూటీ కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, ఈ పాత్ర ఆమె నటనకు మంచి స్కోప్ ఇచ్చేలా ఉంటుందని టాక్ .
కానీ ఈ ప్రాజెక్ట్‌లో అందరినీ ఊరిస్తున్న అసలైన సస్పెన్స్ ఏంటంటే.. ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించబోతున్నారనేదే. రుక్మిణి వసంత్ లాంటి క్రేజీ బ్యూటీకి జోడీగా అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న హీరోనే రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నాని ప్రొడక్షన్‌లో ఒక స్టార్ హీరో నటిస్తారా లేక ఒక సరికొత్త యంగ్ ఫేస్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. హీరో ఎంపిక పూర్తయిన వెంటనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో సర్ప్రైజ్ ఇవ్వాలని నాని టీమ్ ప్లాన్ చేస్తోంది.
also read :అభిమానులపై మళ్లీ ఫైర్ అయిన బాలయ్య.. విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్!
నాని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌లో శైలేష్ కొలను దర్శకత్వంలో కార్తి హీరోగా రాబోయే మోస్ట్ అవేటెడ్ మూవీ హిట్-4 సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే, ఈ మురళీకాంత్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాబోయే ఆగస్టు నెలలోనే ఈ విభిన్న కథాచిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇన్ సైడ్ టాక్. టాలెంటెడ్ డైరెక్టర్, ట్రెండింగ్ హీరోయిన్, నాని ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కలవడంతో ఈ కాంబో అనౌన్స్ కాకముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.