Star Breakups:సినీ ఇండస్ట్రీ లో ప్రేమలు ఎంత సహజమో బ్రేకప్ లు అంత కన్నాఎక్కువ సహజం. ఇక రేపో మాపో పెళ్లి చేసుకుంటారు అనుకున్న జంటలు ఎన్నో అడ్డంగా బ్రేకప్ చెప్పుకున్నవే.మరి సోషల్ మీడియా తో పాటు వివిధ ఫ్లాట్ ఫామ్స్ లో వైరల్ అయిన బ్రేకప్ జంటలంటూ కొన్ని జోడీలు తెగ సర్క్యులేట్ అయ్యాయి.మరింతకీ బాగా పాపులర్ అయిన బ్రేకప్ స్టార్స్ ఎవరో మీరే చూసేయండి.
ఐశ్వర్య రాయ్
ముందుగా మాజీ విశ్వ సుందరి,వెటరన్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ విషయానికి వస్తే ఈ భామ సల్మాన్ ఖాన్ తో నెరిపిన ప్రేమాయణం అప్పట్లో ఒక సంచలనం ఇద్దరి రిలేషన్ గురించి అప్పట్లో విపరీతమైన చర్చ జరిగింది కూడా. కానీ కారణాలు ఏవైనా పెళ్లి పీటలు చేరకుండానే ఆ బందం ముగిసిపోయింది.ఇక ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్ తో ప్రేమ పారాలు వల్లెవేసినా చివరికి అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుని కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టింది.
also read :“జబర్దస్త్‌కి అప్పటి క్రేజ్ లేదు.. అసలు కారణం ఇదే!”
బిపాషా బసు
ఇక బిపాషా బసు విషయానికి వస్తే జాన్ అబ్రహాంతో ఈ భామ రాసిన లవ్ స్టోరీ అప్పట్లో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది.దాదాపు పదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకుంటారని ఎంతో ఆశపడ్డారు అభిమానులు.కానీ చివరికి బ్రేకప్‌తో బాయ్ చెప్పేసిన బిపాషా నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుని లైఫ్ హాయిగా లీడ్ చేస్తుంది.
దీపికా పదుకొణె
బాలీవుడ్‌లో ఒకప్పుడు దీపికా పదుకొణె, రణబీర్ కపూర్ ప్రేమకథ చాలా ఫేమస్. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డారు. కానీ కొన్ని కారణాల వల్ల వారి బంధం చివరకు బ్రేకప్‌తో ముగిసింది. ఈ విడిపోవడం తన జీవితంపై చాలా ప్రభావం చూపిందని, ఒక దశలో డిప్రెషన్‌ను కూడా ఎదుర్కొన్నానని దీపికా చెప్పింది. అయితే ఆ బాధ నుంచి బయటపడి సినిమాలపై ఫోకస్ పెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తర్వాత రణవీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తోంది.
శిల్పా శెట్టి
శిల్పా శెట్టి, అక్షయ్ కుమార్ ప్రేమ వ్యవహారం ఒకప్పుడు బాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా చాలామంది అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో వీరి బంధం బీటలు వారింది. ఆ సమయంలో ఎదురైన బాధ గురించి పలు సందర్భాల్లో శిల్పా బయటపెట్టింది కూడా.తర్వాత వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్నిమొదలెట్టేసింది.
కత్రినా కైఫ్
కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ రిలేషన్ కూడా అప్పట్లో బాలీవుడ్‌లో ఒక సంచలనం . ఇద్దరూ కలిసి కనిపించడం, విదేశీ ట్రిప్స్‌కు వెళ్లడం అప్పట్లో పెద్ద వార్త అయ్యేది కూడా . కానీ కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య దూరం పెరిగి విడిపోయారు. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టిన కత్రినా.. చివరకు విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుని ఒక ఇంటిది అయిపొయింది..
అనుష్క శర్మ
అనుష్క శర్మ, రణవీర్ సింగ్ మధ్య ప్రేమ ఉందంటూ అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. తర్వాత అనుష్క భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరి వైవాహిక జీవితం ఎంత అన్యోన్యంగా సాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం కూడా.
నేహా కక్కర్
ప్రముఖ సింగర్ నేహా కక్కర్ కూడా ప్రేమలో చేదు అనుభవాన్ని ఫేస్ చేసిందే.నటుడు హిమాంశ్ కోహ్లీతో విడిపోయిన తర్వాత తాను చాలా బాధపడ్డానని సోషల్ మీడియాలో పలు మార్లు చెప్పింది కూడా.మొత్తానికి రోహన్‌ప్రీత్ సింగ్‌ను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఈ భామ.
సుష్మితా సేన్
ఇక మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ పలు ప్రేమకథలని పలికించిందే. కానీ ఏ బంధం కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. అయినప్పటికీ ఆమె తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా కొనసాగిస్తూ, ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.ఇపుడు ల;లలిత్ మోడీ తో ప్రేమాయణం అంటూ వార్తలు వచ్చాయి కాని ఎవరూ నోరు విప్పని పరిస్థితి.
నర్గిస్ ఫఖ్రీ
ఇక నర్గిస్ ఫఖ్రీ, ఉదయ్ చోప్రా ప్రేమ వ్యవహారం గురించి కూడా అప్పట్లో వార్తలు గట్టిగానే చక్కర్లు కొట్టాయి.కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. తర్వాత నర్గిస్ తన కెరీర్‌పై దృష్టి పెట్టింది ఈ ముద్దుగ్గుమ్మ.
ప్రీతి జింటా
ఇక ప్రీతి జింటా, వ్యాపారవేత్త నెస్ వాడియా రిలేషన్ కూడా ఒకప్పుడు వార్తల్లో నిలిచిందే.కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తన జీవితంలో అనేక సమస్యలను ఫేస్ చేసిన ప్రీతి.. జీన్ గుడ్‌ఇనఫ్‌ను పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది.
ఏది ఏమైనా జీవితంలో ప్రేమలో విఫలమైనా అక్కడే ఆగిపోకుండా మరొకరితో జీవితాన్ని పంచుకుని కెరీర్ లో దూసుకుపోతున్న ఈ భామలని మెచ్చుకుని తీరాల్సిందే.
also read :పావలా శ్యామల మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ వైరల్!