BigTV English
Advertisement

HYDRAA: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కేటిఆర్ విమర్శలు.. హైడ్రాను సమర్థించిన ఎంపీ

HYDRAA: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కేటిఆర్ విమర్శలు.. హైడ్రాను సమర్థించిన ఎంపీ

HYDRAA: ‘హైడ్రా’పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే కేటిఆర్ హైడ్రాను ఒక భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.


ఆదివారం  ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకువచ్చారని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా పర్మిషన్లు ఇవ్వడం వల్లే ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో 75 శాతం చెరువులు, నాళాలు కబ్జాకు గురైనట్లు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో 600 చెరువుల్లో 44 పూర్తిగా మాయం కాగా, 127 చెరువులు సగానికి సగం కబ్జా అయ్యాయని అన్నారు.

READ ALSO: HYDRAA: 6 నెలల్లో ఆహ్లాదంగా మారిన కూక‌ట్‌ప‌ల్లి న‌ల్లచెరువు.. హైడ్రా ప‌నితీరును ప్రశంసించిన స్థానికులు


పదేళ్లు మున్సిపల్ శాఖామంత్రిగా ఉన్న కేటిఆర్ ఈ కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్లే అమాయకులు హైడ్రా బారిన పడ్డారని అన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని, 360 చెరువుల్లో, 20 నాళాల మీద, 38 పార్కుల్లో ఆక్రమణలను తొలగించిందని తెలిపారు. శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట్, దేవరయాంజాల్, గచ్చిబౌలిలో జరిగిన భూ కబ్జాలను హైడ్రా అడ్డుకుందని ఉదాహరణలు ఇచ్చారు.

హైడ్రా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగాన్ని బయటపెట్టడానికే ఏర్పడిందని అన్నారు. హైదరాబాద్‌ను న్యూయార్క్, లండన్ చేస్తానని చెప్పిన కేటిఆర్, కనీసం నాళాల్లో మట్టి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. హైడ్రా వల్ల లబ్ధి పొందిన ప్రజలు బయటకు వచ్చి మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హైడ్రా పేదలను వేధిస్తోంది, పెద్దలను వదిలేస్తోంది: కేటీఆర్

“పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం” నినాదంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ భవన్‌లో ‘హైడ్రా’ చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తోందని, కానీ ఇతర పెద్ద నాయకుల అక్రమ కట్టడాలను మాత్రం వదిలేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.  చెరువులు, మూసీ నదిలో పెద్దల నిర్మాణాలు అధికారులకు కనిపించడం లేదని, పేదలకు మాత్రం నోటీసులు ఇవ్వకుండా, కోర్టుకు వెళ్లే సమయం కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి కూల్చివేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాం నిర్మాణాలదని, కాంగ్రెస్ పాలన కూల్చివేతలదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెగ్యులరైజ్ చేయాలన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు కూల్చడం ఏంటని ప్రశ్నించారు. 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తుందని, హైడ్రా బాధితులందరికీ న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

 

 

 

 

Related News

Seethakka: నెద‌ర్లాండ్ లో మంత్రి సీత‌క్క ప‌ర్య‌ట‌న‌, ఘన స్వాగతం ప‌లికిన‌ తెలుగు వాసులు

Jubilee Hills Bypoll: సొంత నేతలపై బీఆర్ఎస్ నిఘా..

College Strike: ప్రైవేట్ కాలేజీల ప్రత్యక్ష పోరు.. రేపటి నుంచి నిరవధిక బంద్

Komatireddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి?

Cyber Fraud: యూట్యూబర్ హర్ష సాయి పేరుతో ఘరానా మోసం.. జగిత్యాల యువకుడికి సైబర్ వల… రూ. 87,000 స్వాహా!

KTR On Hydra: పేద‌వాడి ఇంటి మీదకు బుల్డోజ‌ర్.. హైడ్రా పేరుతో అరాచకాలు: కేటీఆర్

Teacher Wine Shop: అదృష్టం వరించింది ఉద్యోగం పోయింది.. ప్రభుత్వ టీచర్ కు వింత పరిస్థితి

Big Stories

×