Dharma Mahesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న ధర్మ మహేష్(Dharma Mahesh) ఇటీవల తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ధర్మ మహేష్ గౌతమి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ధర్మా మహేష్ భార్య గౌతమి (Gawthami) మీడియా ముందుకు వచ్చి తన భర్త బాగోతం మొత్తం బయటపెట్టారు. ఇలా తరచూ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఈమె తన భర్తకు ఇతర అమ్మాయిలతో రిలేషన్ ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత కొద్దిరోజులుగా మహేష్ తనకు మధ్య విభేదాలు వచ్చాయని అయితే ఈ విభేదాలు రావడానికి కారణం రీతూ చౌదరి(Rithu Chowdary), కిరాక్ సీత వంటి వారే కారణం అంటూ ఈమె పలువురు పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. ఇక రీతు చౌదరికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా గౌతమి బయట పెట్టడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో రీతూ చౌదరి తన ఫ్లాట్ కి వచ్చి తన భర్తతో కలిసి ఉండటం ఉదయమే వెళ్లపోవడం జరుగుతుంది అంటూ సీసీటీవీ ఫుటేజ్ లను బయటపెట్టారు. ఇక ఈ వీడియోలు కాస్త వైరల్ గా మారడంతో చివరికి ధర్మా మహేష్ కుటుంబ సభ్యులు కూడా ఈ వివాదంపై స్పందించారు.
రీతు మంచి స్నేహితురాలు మాత్రమే…
ఇలా రీతూ చౌదరి గురించి ధర్మ మహేష్ గురించి గౌతమి చేసిన ఈ వ్యాఖ్యలపట్ల నటుడు ధర్మ మహేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన గౌతమికి ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. తన భార్య గౌతమి వరకట్నపు వేధింపులు, వివాహేతర సంబంధం గురించి చేసిన ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. తనకు రీతుకి మధ్య ఎలాంటి సంబంధం లేదని ,ఆమె తన స్నేహితురాలు మాత్రమేనని తెలిపారు. గౌతమి కేవలం లిఫ్ట్ నుంచి బయటకు వస్తున్న ఫుటేజీలను మాత్రమే బయటపెట్టారు. నిజంగా ఆమె చేసే వ్యాఖ్యలు నిజమైతే మా బెడ్ రూమ్ కి సంబంధించిన ఫొటోజీలను కూడా బయట పెట్టాలి అంటూ ఈయన సవాల్ విసిరారు.
కన్న కొడుకును కూడా చూపించడం లేదా?
గౌతమి చేస్తున్న ఈ ఆరోపణలన్ని కేవలం ఆస్తికోసం మాత్రమేనని తెలిపారు. తనకు సెటిల్మెంట్ చేస్తేనే తన కొడుకును కూడా చూపిస్తాము అంటూ గౌతమి వర్గం చెబుతున్నారని ధర్మా మహేష్ ఈ సందర్భంగా తన భార్య గౌతమీ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా రీతు తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని తెలియజేశారు. మరి మహేష్ వ్యాఖ్యల పట్ల గౌతమి స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే రీతు చౌదరి ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లో ఉన్న సమయంలో తన గురించి బయట ఇలాంటి వార్త చక్కర్లు కొట్టడంతో ఈమెపై భారీ స్థాయిలో నెగిటివిటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెగిటివిటీ కారణంగా రీతు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
Also Read: Sai Pallavi Bikini : అంతా ఫేక్… నిప్పులాంటి సాయి పల్లవినే అవమానించారు