BigTV English
Advertisement

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Flipkart iphone order Scam| ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సెప్టెంబర్ 23, 2025 నుంచి ప్రారంభమైంది. ఈ సేల్‌లో ఐఫోన్ 16, 16 ప్రో మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. కానీ ఐఫోన్ ఆర్డర్లు అన్నీ క్యాన్సిల్ కావడంతో.. కస్టమర్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది దీన్ని ‘స్కామ్’, మోసం అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఫ్లిప్‌కార్ట్ సేల్ పట్ల అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు, ట్వీట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్లు చూస్తే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ తో పోటీలో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల విశ్వాసాన్ని కోల్పోతోందని అనిపిస్తోంది.


ఐఫోన్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను సెప్టెంబర్ 23 నుంచి అందరికీ ప్రారంభించింది. ఈ సేల్ లో ఐఫోన్ 16 (128GB) ధర రూ. 51,999కి తగ్గింది. ఐఫోన్ 16 ప్రో ధర (128GB) రూ. 69,999కి లభిస్తోంది. ఈ ఆఫర్లు చాలా మందిని ఆకర్షించాయి. ఐఫోన్ స్టాక్ అంతా త్వరగా అయిపోయిది.

ఐఫోన్స్ ఆర్డర్లు కన్‌ఫర్మ్ అయిన తరువాత అన్నీ క్యాన్సిల్
చాలా మందికి ఐఫోన్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన కొన్ని గంటల తర్వాత క్యాన్సలేషన్ నోటిఫికేషన్లు వచ్చాయి. కస్టమర్లు పేమెంట్ చేసినా క్యాన్సిల్ అయ్యాయి. ఒక కస్టమర్ అయితే తాను ఆర్డర్ చేసిన ఐఫోన్ 16, 16 ప్రో రెండూ ఒకే రాత్రిలో కోల్పోయాడు. అతనికి నోటిఫికేషన్‌లో కారణం కూడా స్పష్టంగా తెలుపలేదు.


మరొకరికైతే నాలుగు గంటల్లో మూడు ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయి. షిప్మెంట్ అయినవి కూడా డెలివరీ అప్‌డేట్ కాకుండా ఉన్నాయి. ఈ పరిణామాలతో చాలా కస్టమర్లు ఆగ్రహంగా ఉన్నారు. ‘పేమెంట్ ఫెయిల్యూర్’ అని చెప్పి క్యాన్సిల్ చేస్తున్నారు, కానీ పేమెంట్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఆ తరువాత అదే ఐఫోన్లు సాధారణ ధరతో అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.

సోషల్ మీడియా లో వెల్లువలా పోస్ట్‌లు
X (ట్విట్టర్)లో కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌పై తీవ్ర విమర్శుల చేస్తున్నారు. “బిగ్ బిలియన్ డేస్ స్కామ్” అని ఒకరు ట్వీట్ చేశారు. విజయ్ రామ్ అనే ఒక యూజర్ తన పోస్ట్ లో.. ధరలు రూ. 69,999 నుంచి రూ. 94,000కి పెరగడానికి స్క్రీన్‌షాట్‌లు పోస్ట్ చేశాడు. నబీల్ జావెద్ అనే యూజర్ లాంచ్ రోజే మిడ్‌నైట్‌లో “ప్యూర్ చీటింగ్” అని రాశాడు.

మనీకంట్రోల్, లేటెస్ట్‌లీ, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ వంటి మీడియా రిపోర్ట్‌లల్లో కూడా యూజర్ల విస్తృత కోపం కనిపిస్తోంది. #FlipkartScam, #BigBillionScam హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అయ్యాయి. ప్రణయ్ మహేశ్వరి వంటి యూజర్ కన్స్యూమర్ ఫోరమ్‌ లో ఫ్లిప్ కార్ట్ యజమాన్యంపై కేసు వేయాలని పిలుపునిచ్చారు.

ఇదంతా స్కామ్ అని ఆరోపణ
ఇదంతా తక్కువ ధరలు చూపించి క్లిక్‌లు, కార్ట్‌లు పెంచడానికి ఉపయోగపడతాయని కస్టమర్లు అనుమానిస్తున్నారు. ఆర్డర్లు కన్‌ఫమ్ చేసి తర్వాత క్యాన్సలేషన్లతో నిరాశపరుస్తున్నారు. ఇది ‘ఎంగేజ్‌మెంట్ బైట్’ లాంటిదని చాలా మంది అంటున్నారు. అమెజాన్ సేల్‌తో పోటీలో ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా సైలెంట్‌గా ఉంది. ఎలాంటి స్టేట్‌మెంట్ లేదు. కస్టమర్లు రిఫండ్‌లు, వివరణలు డిమాండ్ చేస్తున్నారు.

షాపర్లు ఏం డిమాండ్ చేస్తున్నారంటే..
కంపెనీ క్యాన్సిల్ అయిన ఆర్డర్ల గురించి సరైన కారణాలు తెలుపాలి. రిఫండ్‌లు తక్షణం ప్రాసెస్ చేయాలి. పాపులర్ ప్రొడక్టుల స్టాక్ పెంచాలి. ఆర్డర్ అప్‌డేట్‌లు ఇవ్వాలి. అమెజాన్ లాంటి ఇతర ప్రముఖ పోటీదారుల ప్లాట్ ఫామ్ కు షాపర్లు త్వరగా మారిపోవచ్చు.. అని షాపర్లు హెచ్చరిస్తున్నారు.

పండుగ సేల్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డీల్స్ బాగా చెక్ చేసిన మాత్రమే ప్రొసీడ్ చేయండి. టర్మ్స్, అవైలబిలిటీ జాగ్రత్తగా చూడండి. సెక్యూర్ కనెక్షన్‌లో పేమెంట్ చేయండి. డీల్ టైమ్‌లో ఆర్డర్ గంటకు ఒకసారి చెక్ చేయండి. అమెజాన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా డీల్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తప్పుడు డీల్స్ బారిన పడొద్దు.

Also Read: నో-కాస్ట్ ఈఎంఐల పేరుతో దోపిడీ.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ షాపింగ్ సమయంలో జాగ్రత్త!

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×