Telugu Hero:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కొక్కరి స్టార్ స్టేటస్ ను బట్టి, వారి పర్ఫామెన్స్ ని బట్టి అభిమానులు వారికి ట్యాగులను తగిలించారు. అలా చిరంజీవికి మెగాస్టార్.. బాలకృష్ణకు నటసింహ.. రవితేజకు మాస్ మహారాజా.. విజయ్ దేవరకొండకు రౌడీ హీరో.. రామ్ చరణ్ కు మెగా పవర్ స్టార్.. ఎన్టీఆర్ కి యంగ్ టైగర్.. ప్రభాస్ కు రెబల్ స్టార్ .. అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్.. మహేష్ బాబుకి సూపర్ స్టార్.. నాగార్జునకు కింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో హీరోకి ఒక్కో ట్యాగ్ తగిలించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో రెండు ట్యాగ్ లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అవే రైజింగ్ స్టార్ , ఒమేగా స్టార్.. ఈ రెండు ట్యాగ్ లు విని అరే ఇదెక్కడి నుంచి వచ్చాయి ఇవి ఎవరికి ఉన్నాయి అంటూ సినీ ప్రేక్షకులు సైతం ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ రెండు బ్యాగులు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలకి ఉన్నాయని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. వారెవరో కాదు దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ (Krishna) పెద్ద కొడుకు రమేష్ బాబు(Ramesh Babu), అలాగే మహేష్ బాబు(Mahesh Babu).
also read:Bahubali The Epic : బాహుబలికి భయం మొదలైంది… ప్రభాస్ కూడా కాపాడలేడు ?
విషయంలోకి వెళ్తే.. అప్పట్లో హీరోలకు అభిమాన సంఘాలు ఉండేవి. అయితే ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి.. కాకపోతే అప్పట్లో ఉండే హీరోల అభిమానుల సంఘాలే అన్నీ చూసుకునేవారు. అలా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమేష్ బాబుకి కూడా “కళాజ్యోతి రైజింగ్ స్టార్ రమేష్ యువత” అనే ఒక ఫ్యాన్ అసోసియేషన్ ఉండేది. అయితే వీరు ఒకసారి మహేష్ బాబు (Maheshbabu) తన తొలి చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఒక పామ్లెట్ ను విడుదల చేశారు. అందులో “మా రైజింగ్ స్టార్ రమేష్ బాబు సోదరుడు ఒమేగా స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు తొలి చిత్రం ప్రారంభం.. అలాగే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఒక పామ్లెట్ విడుదల చేయడం జరిగింది. అయితే అప్పట్లో విడుదల చేసిన ఈ పామ్లెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమాని ఒకరు షేర్ చేయడంతో ఈ రైజింగ్ స్టార్.. ఒమేగా స్టార్ ఏంటి మేమెప్పుడూ వినలేదే.. అసలు ఇవి ఎప్పుడు పెట్టారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే సూపర్ స్టార్ కృష్ణ తనయులు రమేష్ బాబుకు రైజింగ్ స్టార్ అని, మహేష్ బాబు తొలి చిత్రానికి ఒమేగా స్టార్ అని ట్యాగ్ లు తగిలించారని తెలిసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని మహేష్ బాబు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు కూడా..
Omega Star ante minimum vuntadiga Bro pic.twitter.com/4Npzasqfsz
— Vincy (@ThePrabhasFan_) October 26, 2025