Brahmamudi serial today Episode: కావ్య మల్లెపూలు పెట్టుకుని కొత్త చీర కట్టుకుని శోభనపు పెళ్లికూతురులా తయారవుతుంది. పాల గ్లాస్ పట్టుకుని రూంలోకి వెళ్తుంది. కావ్యను అలా ఆ గెటప్‌లో చూసిన రాజ్ ఆశ్చర్యపోతాడు. ఏయ్ ఏంటి ఈ అవతారం అని అడుగుతాడు. తొలిరాత్రి అవతారం అని కావ్య చెప్తుంది. ఇప్పుడెందుకే ఇది అని రాజ్ అడగ్గానే.. అప్పుడు ముహూర్తం కావాలేమో ఇప్పుడు అవసరం లేదు మొగుడు గారు ఇప్పుడు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఈ అవతారం ఎత్తొచ్చు అంటుంది కావ్య. దీంతో రాజ్ నాన్నమ్మ నువ్వు ఆకలికి తట్టుకోలేవు భోజనం మానేయ్ అంటే అర్థం కాలేదు.. కానీ గదిలోకి వచ్చి చూస్తే అర్థం అవుతుంది అంటూ రాజ్ అనగానే.. కావ్య ఏమన్నారు అమ్మమ్మ గారు కాస్త మంచి చెడు చూసుకోమన్నారా..? అని అడుగుతుంది. దీంతో కాదు అసలు భోజనం వైపే వెళ్లొద్దు అంది అంటాడు రాజ్. అదెలా మరి వేడి వేడిగా ఉన్న వంటలన్నీ నేనేం చేసుకోను అంటుంది కావ్య.
దీంతో రాజ్ కోపంగా వంట కాదే ఇదో పెద్ద తంట అంటాడు రాజ్. దీంతో తంట కాదంట మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంట. అందుకే పూలు పెట్టానంట.. ఇక ఆలస్యం చేయోద్దంట.. అంటుంది. అసలు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందే.. ఇలా రెడీ అయి నువ్వు గదిలోకి వస్తే బయట చూసే వాళ్లు ఏమనుకుంటారే..? అని అడుగుతాడు రాజ్. దీంతో ఏమనుకుంటారు..? మనం భార్యాభర్తలం అనుకుంటారు. ఏదో ముచ్చటపడ్డాం అనుకుంటారు.. అనగానే.. రాజు గాడికి సిగ్గు లేదు.. కళావతికి బుద్ది లేదు అనుకుంటారు.. అని రాజ్ చెప్పగానే.. ఎందుకనుకుంటారండి.. మీరు వచ్చింది నా దగ్గరకే కదా మీరేమైనా పక్కింటావిడ దగ్గరకు వెళ్లారా..? ఏంటి అని కావ్య అడగ్గానే..అయ్యో దేవుడా నీకు ఎలా చెప్పాలే..? అని రాజ్ అనగానే.. ఎలాగైనా చెప్పొచ్చు ముద్దు ఇస్తూ చెప్పోచ్చు హగ్ చేసుకుంటూ చెప్పొచ్చు.. ఇంకా ఏదైనా చేస్తూ చెప్పొచ్చు మీ కంపర్ట్ అంటుంది కావ్య..
దీంతో రాజ్ ఏయ్ ఇప్పుడు నువ్వున్న పరిస్థితి ఏంటి… నువ్వు మాట్లాడే మాటలేంటి..? అసలేమైనా మ్యాచ్ అవుతుందా..? అని అడుగుతాడు. దీంతో కావ్య నా పరిస్థితి ఏంటండి..? నేను బ్రహ్మండంగా ఉన్నాను.. అని చెప్తుంది. నువ్వు కడుపుతో ఉన్నావే.. అంటాడు రాజ్.. అయితే కాపురం చేయకూడదని ఎక్కడైనా రాసి పెట్టి ఉందా..? అవ్వదారి అవ్వదే.. బువ్వ దారి బువ్వదే.. అంటుంది కావ్య. అది కాదే నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే.. అంటాడు రాజ్. దీంతో కావ్య నేను ఉన్నన్నాళ్లు మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను.. అంటూ కావ్య చెప్పగానే.. నువ్వు ఏం చెప్తున్నావో ఏం చేస్తున్నావో అర్థం కావడం లేదు కళావతి అంటూ రాజ్ బాధపడతాడు. దీంతో నిజం చెప్పనా…నాకు ఈ క్షణం ఏ దిగులు లేదు.. నా బిడ్డకు జన్మనిచ్చి నేను ఎగ్జిట్ అయ్యే వరకు ఇలాగే హ్యాపీగా ఉండనివ్వండి.. అంటుంది. దీంతో రాజ్, కోపంగా కావ్యను తిడతాడు. ఇద్దరి మధ్య రొమాంటిక్ గొడవ జరుగుతుంది.
రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుంటే.. స్వప్న వస్తుంది. చూసి షాక్ అవుతుంది. స్వప్నను చూసిన రాహుల్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. దగ్గరకు వచ్చిన స్వప్న ఎవరు అని అడుగుతుంది. దీంతో ఎవరూ లేరే అంటాడు రాహుల్.. ఎవ్వరూ లేకుండానే అన్ని మెలికలు తిరిగిపోతున్నావా..? ఎవ్వరూ లేకుండానే అంత సొల్లు కార్చుకుంటున్నావా..? అంటూ స్వప్న తిట్టగానే.. ఇంట్లో నువ్వు ఉన్నావుగా అందం ఎక్కువైన అప్సరసవి.. నువ్వు ఎప్పుడు ఎంట్రీ ఇస్తావా..? అంటూ మెలికలు తిరిగిపోతున్నాను.. అంటాడు రాహుల్. దీంతో స్వప్న కోపంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నువ్వు ఎంత దాచినా ఇక దాగదు. ఈరోజు నువ్వు ఎవరితో తిరగడం నేను చూశాను అంటుంది స్వప్న. దీంతో రాహుల్ ఓ చూసేశావా..? అయితే నాకు శ్రమ తగ్గించావు అంటాడు. ఆ బజారు దాని మెడలో నువ్వు కొట్టేసిన నెక్లెస్ చూశాను అంటుంది. అవును నీ నెక్లెస్ లాంటి నెక్లెస్ ఒక్కటే ఉంటుంది. ఎవ్వరికీ ఉండదు మరి అంటాడు రాహుల్. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. దీంతో రాహుల్ దాంతోనే నా జీవితం నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి వెళ్లిపోతాడు.
తర్వాత కావ్యకు ఫ్యాంట్ షర్ట్ వేస్తాడు రాజ్. ఆ గెటప్‌లో కావ్యను చూసిన ఇంద్రాదేవి, అపర్ణ షాక్ అవుతారు. ఈ గెటప్ నీకు బాగుంది ఇదే కంటిన్యూ చేయమ్మా అని చెప్తుంది అపర్ణ. దీంతో అందరూ హ్యాపీగా ఉండగా కిందకు వచ్చిన స్వప్న, రాహుల్ గురించి చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టకూడదు అని మనసులో అనుకుంటుంది. తర్వాత కావ్య, స్వప్నను బయటకు తీసుకెళ్లి ఏం జరిగిందని అడుగుతుంది. దీంతో రాహుల్‌తో జరిగిన గొడవ గురించి చెప్తుంది స్వప్న. దీంతో కావ్య నేను రాహుల్‌తో మాట్లాడతాను.. తప్పకుండా మారతాడు అని చెప్తుంది. కానీ ఇప్పుడిప్పుడే నువ్వు సంతోసంగా ఉన్నావు.. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి వెళ్లిపోతుంది స్వప్న. తర్వాత రాజ్ కావ్య కోసం భోజనం తీసుకొస్తే కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు అలా ఉన్నావని రాజ్ అడగ్గానే.. స్వప్న, రాహుల్ మధ్య జరిగిన గొడవ చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.