Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకొని.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే ‘థామా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) హీరోగా వస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అరవింద్ (Allu Aravindh) సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు చిత్ర బృందం కూడా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటుంది.
అందులో భాగంగానే వరుస ప్రమోషన్స్ లో పలు రకాల విషయాలను కూడా బయటపెడుతోంది.. ముఖ్యంగా వర్క్ – లైఫ్ బ్యాలెన్స్, నటీనటుల పని ఒత్తిడి, భవిష్యత్తు ప్లాన్స్ గురించి ఓపెన్ గా మాట్లాడేసింది ఈ ముద్దుగుమ్మ.. అందులో భాగంగానే రష్మిక మాట్లాడుతూ..” ఓవర్ వర్క్ చేయడం అనేది ఒక గొప్ప విషయం ఏమి కాదు.. నేను కూడా చాలా పని చేస్తాను.. కానీ ఇతరులు అలా చేయకూడదని చెబుతాను. నిజానికి మన శరీరము, మనసు విశ్రాంతి కోరుకుంటుంది. ప్రతిరోజూ 8 నుండి 10:00 నిద్ర చాలా అవసరం. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము కూడా..
పని సమయాల విషయానికి వస్తే.. సెలబ్రిటీలైన మాకు కూడా ఆఫీస్ టైమింగ్స్ లాగా ఫిక్స్డ్ అవర్స్ ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా 9:00 నుండి 5:00 గంటలు లేదా 9:00 నుండి 6:00 పని చేసే విధంగా టైమింగ్స్ ఇవ్వాలి. మిగతా టైం ఆరోగ్యానికి, ఫ్యామిలీకి కేటాయిస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా నా కుటుంబంతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. మనస్పూర్తిగా నిద్రపోవాలనుకుంటున్నాను..ఆరోగ్యంగా ఉండడానికి వర్క్ అవుట్ కూడా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు పనిలో పడి అన్నింటిని కోల్పోతున్నామనే పశ్చాతాపం భవిష్యత్తులో ఉండకూడదని కోరుకుంటున్నాను” అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.
also read:Telugu Hero: టాలీవుడ్ లో రైజింగ్ స్టార్.. ఒమేగా స్టార్.. ఎవరో తెలుసా?
అలాగే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. నేను ఇంకా తల్లిని కాలేదు. కానీ నాకు కూడా పిల్లలు పుడతారు అని తెలుసు. అందుకే వారి కోసం నేను ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను. వారిని సురక్షితంగా ఉంచాలని, వారికంటూ ఒక మంచి జీవితం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. వారి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే ఫిట్ గా కూడా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ కాస్త భావోద్వేగంగా చెప్పుకొచ్చింది రష్మిక.
అలాగే “20 నుండి 30 ఏళ్లలో కష్టపడాలి.. 30 నుండి 40 సంవత్సరాల మధ్యలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించాలి. 40 ఏళ్ల తర్వాత ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు కాబట్టి ఇప్పటినుంచే ప్లాన్ చేసుకొని పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేస్తే.. ఇక మనకేమైనా పర్వాలేదు” అంటూ తన ఫ్యూచర్ ప్లానింగ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మొత్తానికైతే రష్మిక షేర్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇవి చూసిన కొంతమంది మీ ఫ్యూచర్ ప్లానింగ్ బాగుంది అంటుంటే.. ఇంకొంతమంది తొందరెందుకు ముందు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.