Telangana Rains: మొంథా తుపాను కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కుమ్మేస్తున్నాయి. వర్షాల కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ సిటీలో గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అంబర్‌పేట, కాచిగూడ, బర్కత్‌పురా, మీర్‌పేట్, బాలాపూర్, తుక్కుగూడ, పహాడీషరీఫ్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, దోమలగూడ, మెహిదీపట్న ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులపైకి వరద నీరు చేరింది. ఈ క్రమంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలో భారీ వర్షాలు.. రైల్వే ట్రాక్‌పై నీరు, నిలిచిపోయిన రైళ్లు
మొంథా తుపాను క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతోంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ భూభాగంపై కొనసాగుతోంది. దీని కారణంగా ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మొంథా క్రమంగా బలహీనపడుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో పట్టాల పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండటం తో పలు రైళ్లు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు నిలిపివేశారు.
తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. వర్షాల కారణంగా తెలంగాణలో పలుచోట్ల రైల్వేస్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. ముఖ్యంగా రైల్వే ట్రాక్ పైకి వరద చేయడంతో ఇందుకు కారణమైంది. మొత్తం 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్ నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ రైళ్లను రద్దు చేసింది.
హైదరాబాద్‌తో కుమ్మేస్తున్న వానలు.. ట్రాఫిక్ జామ్
అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. దీని కారణంగా రోడ్లపై వరద నీరు వచ్చి చేరింది. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. లక్డికాపూల్, అయోధ్య జంక్షన్, పిటిఐ, మహావీర్ హాస్పిటల్, మసాబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్, ఎన్‌ఎండిసి, ఎస్‌డి హాస్పిటల్, అజీజియా మసీదు, మెహదీపట్నం వైపు రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి.
దయచేసి ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని, సాధ్యమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని చెబుతున్నారు నగర పోలీసులు. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ కారు ప్రమాదానికి గురైంది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ రూట్లో వెళ్లున్న మంత్రి వాకిటి శ్రీహరి రోడ్డుపై ఆగి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ALSO READ: మొంథా ఎఫెక్ట్.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
ఎగువ కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ సిటీలోని జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. ఇన్‌ఫ్లో పెరగడంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీకి 6,600 క్యూసెక్కుల నీటిని వదిలారు అధికారులు. ఉస్మాన్ సాగర్‌కి 18 వందల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 6 గేట్లు ఎత్తి 2,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్‌కి 2,220 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 4 గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. ఎగువ ప్రాంతాల్లో వర్షం కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని వదలనున్నారు.
చెరువును తలపిస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్
నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు pic.twitter.com/8TBDdoWmbE
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2025
#HYDTPinfo
🚧Traffic Alert 🚧
Due to rain, there is a heavy flow of traffic and slow movement of vehicles on both sides from Lakdikapool, Ayodhya Junction, PTI, Mahaveer Hospital, Masabtank Flyover, NMDC, SD Hospital, Azizia Mosque towards Mehdipatnam.
Commuters are advised to… pic.twitter.com/tToSN10yp8— Hyderabad Traffic Police (@HYDTP) October 29, 2025