BigTV English
Advertisement

Dude Movie: ‘డ్యూడ్ ‘ మూవీని తెలుగులో మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Dude Movie: ‘డ్యూడ్ ‘ మూవీని తెలుగులో మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Dude Movie: దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన సినిమాలలో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ కూడా ఒకటి. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. అనుకున్న దానికంటే ఎక్కువగానే థియేటర్ లోకి వచ్చిన తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాగా సరికొత్త రికార్డుని క్రియేట్ చేసుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ హీరో ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ వచ్చి చేరింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా సరే మూవీ గురించి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది.. తాజాగా ఈ మూవీ ని తెలుగులో మిస్ చేసుకున్న హీరో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇది తమిళ్ హీరో మూవీ కాదా? ముందుగా తెలుగులో ఈ సినిమాని తెరకెక్కించాలి అనుకున్నారా? ఏ హీరో ని సంప్రదించారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆ హీరో ఎవరో కాస్త వివరాలు తెలుసుకుందాం..


“డ్యూడ్” మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో..? 

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఒకప్పుడు డైరెక్టర్గా సినిమాలు చేశాడు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఈయన చేసిన మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే డ్యూడ్ మూవీ ని తెలుగులో ఓ స్టార్ హీరో చేయాల్సి ఉండేదట. ఈ మూవీ నుంచి ఆయన తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ప్రదీప్ కు వచ్చిందని తెలుస్తుంది. ఆ హీరో మరి ఎవరో కాదు అక్కినేని వారసుడు నాగచైతన్య. మీరు విన్నది అక్షరాల నిజం.. మైత్రి సంస్థ ఈ సినిమాని ముందుగా ప్రదీప్ ని పెట్టి చెయ్యాలని అనుకోలేదు. అక్కినేని నాగచైతన్య తో చెయ్యాలని అనుకున్నారట. డైరెక్టర్ కీర్తిస్వరణ్ తో నాగ చైతన్యకి ఒకసారి మీటింగ్ ని ఏర్పాటు చేసి ఈ సినిమా కథని వినిపించారట. నాగచైతన్య కి కథ బాగా నచ్చిందట.. తండాల తర్వాత ఆయన అంతకుమించి పెద్ద సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాడట అందుకే ఈ సినిమాని చేయలేనని చెప్పేసినట్లు తెలుస్తుంది. దాంతో ఈ మూవీ కాస్త ప్రదీప్ రంగనాథన్ కు వచ్చింది. ఈ మూవీ కనుక నాగచైతన్య చేసి ఉంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ పడేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే.. 

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే తండేల్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. గత కొన్ని లుగా సరైన హిట్ సినిమాలు లేని నాగచైతన్య ఖాతాలో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు పడింది. ఈ మూవీ తర్వాత నాగచైతన్య ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రస్తుతం విరూపాక్ష సినిమా డైరెక్టర్ కార్తీక్ తో మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లో సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పెద్ద సినిమాలను లైన్లో పెట్టుకుంటూ బిజీగా అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న చైతన్యకు ఈ సినిమా చేస్తే మళ్లీ తక్కువ అయిపోతానని అనుకొని రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది.. మొత్తానికి నాగచైతన్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడేలా కనిపిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.


Related News

Donlee: స్పిరిట్ లో డాన్ లీ.. కన్ఫర్మ్ చేసిన కొరియన్ మీడియా

HBD Nagababu: ఆరోజు తమ్ముడి నిర్ణయం.. నేడు నిలదొక్కుకోవడానికి కారణం అయిందా?

Pawan Kalyan Next Movie : స్టార్ నిర్మాత నుంచి పవన్ కళ్యాణ్‌కు 20 కోట్ల అడ్వాన్స్?

Kantara 1 OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి కాంతార 1.. కారణం చెప్పిన నిర్మాత

Star Kid’s: ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్ కిడ్స్.. ఎవరెవరంటే ?

Peddi: పెద్ది సినిమాలో సుకుమార్ జోక్యం.. అవసరం లేదంటున్న ఫ్యాన్స్

SSMB29 : మెంటలెక్కించే న్యూస్.. మహేష్ ను గుడ్డోడిని చేస్తున్న జక్కన్న.. మ్యాటర్ ఇదే..?

Idly Kottu: ఓటీటీకి స్ట్రీమింగ్ కు వచ్చిన ధనుష్ ఇడ్లీ కొట్టు.. ఎక్కడ చూడొచ్చు అంటే

Big Stories

×