E-Paper
Advertisement

బోయపాటి – కొరటాల మధ్య అక్కడే చెడిందా?

బోయపాటి – కొరటాల మధ్య అక్కడే చెడిందా?
Advertisement

Tollywood: కొరటాల శివ(Koratala siva).. తెలుగు సినిమా రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన ఈయన .. అద్భుతమైన కథలతో విభిన్నమైన జానర్ లలో సినిమాలకు పనిచేసి రచయితగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కొరటాల శివ కలం పట్టారు అంటే ఎంతటి కథ అయినా సరే ఆయన చేతుల్లో అద్భుతం కావాల్సిందే. అలాంటి ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు బావ వరస అయిన పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరి ఒక్కడున్నాడు, బృందావనం, మున్నా , ఊసరవెల్లి వంటి చిత్రాలకు మాటల రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత 2013లో తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.

బోయపాటితో కొరటాలకు విభేదాలా?

ఈ సినిమా తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను ఇలా తీసిన ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యమే. అయితే 2022లో ఆచార్య సినిమా చేసి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. అంతేకాదు ఆచార్య సినిమా డిజాస్టర్ కు కొరటాల శివ కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ఆయనపై ట్రోల్స్, విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 2024లో దేవర సినిమా చేసి మళ్లీ తనను తాను నిరూపించుకున్నారు. అయితే అలాంటి కొరటాల శివకి బోయపాటితో విభేదాలు ఉన్నాయని.. అది కూడా బాలయ్య సినిమా వల్లే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బాలయ్య సినిమా వల్లేనా?

Advertisement

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్, యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన బోయపాటి శ్రీను గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బోయపాటి సినిమా అంటేనే మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఇకపోతే ఈయన కూడా పోసాని కృష్ణ మురళి దగ్గర దర్శకత్వ శాఖలో చేరి దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకున్నారు. ఇకపోతే ఇక్కడ పనిచేస్తున్న సమయంలోనే బోయపాటికి కొరటాలకి మధ్య సన్నిహిత్యం ఏర్పడిందట. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన భద్రా సినిమా నుంచి సింహ వరకు కొరటాల శివ రచయితగా పనిచేశారు. ఇక ఆయన కలం పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే సింహ సినిమా క్రెడిట్ విషయంలోనే తనకు జరిగిన అన్యాయంపై కొరటాల శివ ఇటీవల స్పందించారు.

ALSO READ:డెకాయిట్ ఓవర్సీస్ బిజినెస్.. ఆ ఫీట్ అందుకుంటారా?

అసలు విషయం చెప్పిన కొరటాల శివ..

Advertisement

“నమ్మి మోసపోవడం మన తప్పు.. క్రెడిట్ విషయంలో చిన్న తప్పు జరిగింది.. ఇలాంటివి లైఫ్ లో జరగడం సహజం.. అందుకే ఏది జరిగినా నేర్చుకుంటూ.. ముందుకు వెళ్లాలి” అంటూ చాలా హుందాగా సమాధానం ఇచ్చారు కొరటాల శివ. ఇకపోతే ఆచార్య సినిమా వరకు కూడా ఫ్లాప్ ఎరగని దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న కొరటాల శివ సింహా సినిమా క్రెడిట్ విషయంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఏదేమైనా ఇక ఆ సినిమాతోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బాలకృష్ణ హీరోగా నయనతార హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. పైగా బోయపాటిని దర్శకుడిగా నిలబెట్టిన చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×