Akhanda 2: నందమూరి బాలకృష్ణ(Balakrishna) బోయపాటి శ్రీను(BoyapatieSreenu) దర్శకత్వంలో నటించిన ఆఖండ 2 (Akhanda 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ కూడా ఘనంగా జరగనుంది. తాజాగా ఈ సినిమా నైజాం హక్కులకు(Nizam Rights) సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రముఖ నిర్మాత నాగ వంశీ నేతృత్వంలో నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు(Dil Raju) కైవసం చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేయడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు ఏకంగా 30 కోట్లకు కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దాదాపు ఇదే ధరకే దిల్ రాజు కైవసం చేసుకున్నట్టు సమాచారం. ఇక ఆంధ్ర సీడెడ్ ప్రాంతాలలో కూడా ఈ సినిమా భారీ బిజినెస్ జరుపుకున్న సంగతి సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ హాట్ స్టార్ ఏకంగా 80 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో బిజినెస్ కూడా ఈ స్థాయిలో జరుపుకుందనే చెప్పాలి. ఇక బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి అందరికీ తెలిసిందే.
ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ..
అఖండ 2 సనాతన ధర్మ పరిరక్షణ గురించి తెలియజేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని, ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి సినిమాలు చూపించాల్సిన అవసరం ఉందని స్వయంగా బాలకృష్ణ వెల్లడించారు. ఇందులో బాలకృష్ణ సనాతన ధర్మ పరిరక్షకుడిగా కనిపించబోతున్నారు. ఇకపోతే బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించగా ఒక పాత్రలో సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఉండగా మరొక పాత్రలో ఎమ్మెల్యేగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక బాలయ్యతో పోటీగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు . సంయుక్త మీనన్ హీరోయిన్ గా సందడి చేయబోతున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించగా గోపి అచంట , రామ్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Actor Madhvan : మాధవన్ మహేష్ తండ్రిగా కాదా…ఆ పాత్రలో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?