Noise Buds N1: ప్రస్తుతం మార్కెట్లో స్టైలిష్ లుక్ , సూపర్ సౌండ్ క్వాలిటీతో ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘నాయిస్’నుంచి వచ్చిన అద్భుతమైన గాడ్జెట్ ఇది. అల్ట్రా-మోడర్న్ క్రోమ్ ఫినిషింగ్, సుదీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్ , గేమర్స్‌ను ఆకట్టుకునే లో లేటెన్సీ ఫీచర్లతో ఇది మార్కెట్లో తెగ హల్ చల్ చేస్తోంది. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఐస్ బ్లూ కలర్‌లో లభించే ఈ ఇయర్ బడ్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇయర్ బడ్స్ విషయంలో.. ఈ రోజుల్లో యూజర్లు అందం , స్టైల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ ఇయర్ బడ్స్ ప్రత్యేకత ఏంటంటే.. ఇవి ప్రీమియం క్రోమ్ ఫినిషింగ్‌తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ముఖ్యంగా.. ఇందులో అందుబాటులో ఉన్న ‘ఐస్ బ్లూ’కలర్ వేరియంట్ యూత్‌ను ఇన్‌స్టంట్‌గా అట్రాక్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇది చెవులలో పెట్టుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్‌గా ఉండటంతో పాటు, లాంగ్ అవర్స్ వాడినప్పటికీ ఎలాంటి నొప్పీ అనిపించదు.
ఎప్పుడూ చార్జింగ్ పెట్టుకునే.. టెన్షన్ లేకుండా ఉండాలంటే ఈ ఇయర్ బడ్స్ బెస్ట్ ఛాయిస్. ఈ డివైజ్ టోటల్‌గా.. ఏకంగా 40 గంటల ప్లేటైమ్ అందిస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ చార్జ్ చేస్తే.. రోజంతా మ్యూజిక్ లేదా కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ అర్జెంట్ పని మీద బయటకు వెళ్లేటప్పుడు.. చార్జింగ్ అయిపోతే.. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇందులో ఉన్న ‘ఇన్‌స్టాచార్జ్’ టెక్నాలజీ సాయంతో.. కేవలం 10 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు, ఏకంగా 120 నిమిషాలు (2 గంటలు) నాన్ స్టాప్ మ్యూజిక్ లేదా టాకింగ్ ఎంజాయ్ చేయొచ్చు.
ఆఫీస్ మీటింగ్స్ లేదా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడేవారికి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి నాయిస్ బడ్స్ N1 లో క్వాడ్ మైక్ సిస్టమ్‌తో కూడిన ENCటెక్నాలజీని అందించారు. దీనివ ల్ల మనం మాట్లాడుతున్నప్పుడు చుట్టు పక్కల ఉండే అనవసరమైన శబ్దాలను ఇది పూర్తిగా తొలగిస్తుంది. అంతే కాకుండా మీకు అవతలి వారికి మన గొంతు క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తుంది.
ఆన్‌లైన్ గేమ్ ఆడే వారికి ఆడియో సింక్ చాలా ముఖ్యం. గన్ ఫైర్ అయ్యే శబ్దం కాస్త లేట్‌గా వినిపించినా గేమ్‌లో ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే నాయిస్ సంస్థ దీంట్లో అల్ట్రా లో లేటెన్సీ గేమింగ్ మోడ్ అందించింది. దీనివల్ల ఆడియో, వీడియో మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా రియల్-టైమ్ రెస్పాన్స్ అందుతుంది. గేమర్స్‌కు ఇది నిజంగా ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పొచ్చు.
Also Read: హైయర్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లపై..40% డిస్కౌంట్!డోంట్ మిస్
ఈ ఇయర్ బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ v5.3 సపోర్ట్‌తో వస్తాయి. దీని వల్ల స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్‌తో ఇవి క్షణాల్లో పేర్ అవుతాయి. అంతే కాకుండావీటిలో సిగ్నల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.మధ్యలో ఆడియో కట్ అవ్వడం లాంటి సమస్యలు అసలు రావు. టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ లిఫ్ట్ చేయడం, మ్యూజిక్ మార్చడం, వాల్యూమ్ కంట్రోల్ చేయడం చాలా ఈజీ .
తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, అదిరి పోయే లుక్ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కోరుకునే వారికి ఈ మోడల్ ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్. స్టైలిష్ గాడ్జెట్ ఇష్ట పడేవారికి ఇది కచ్చితంగా గొప్ప ఫీల్ ఇస్తుంది. మీరు కూడా ఈ ట్రెండీ ఇయర్ బడ్స్‌ను మీ చేతిలోకి తీసుకోవాలనుకుంటే.. ఆన్ లైన్‌లో బెస్ట్ ఆఫర్స్ చెక్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేసేయండి!