Car Accident: హైదరాబాద్ మెహిదీపట్నం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. PVNR ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 40 సమీపంలో శంషాబాద్ నుంచి మోహిదీపట్నం వైపు వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో రెండు వైపులా హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని రోడ్డు పై ఉన్న కారును పక్కకు తరలించి.. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాద జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి అతి వేగం, అజాగ్రత్తే కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటపపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.