E-Paper
Advertisement

మలక్‌పేటలో విషాదం.. యువతికి వీడియో కాల్ చేసి..  కానిస్టేబుల్ ఆత్మహత్య!

మలక్‌పేటలో విషాదం.. యువతికి వీడియో కాల్ చేసి..  కానిస్టేబుల్ ఆత్మహత్య!
Advertisement

Constable Suicide: హైదరాబాద్‌ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసారాంబాగ్‌ శాలివాహననగర్‌లో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. అంబర్‌పేట పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

యువతికి వీడియో కాల్..

Advertisement

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో చంద్రశేఖర్ ఒక యువతికి వీడియో కాల్ చేశాడు. మాటల మధ్యలో తానూ ఉరివేసుకుంటున్నట్లు ఆ వీడియో కాల్‌లోనే ప్రత్యక్షంగా చూపిస్తూ ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువతి వెంటనే అప్రమత్తమై చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించింది.

కేసు నమోదు..

Advertisement

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే చంద్రశేఖర్ మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. చంద్రశేఖర్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న అసలు కారణాలేమిటన్న కోణంలో చైతన్యపురి, మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాల కబ్జాపై విచారణ జరపాలి: జనసేన

Tags

Related News

శ్రీశైలం మార్గంలో ఘోర ప్రమాదం.. క్రూజర్ ఢీకొని ఇద్దరు యూపీ వాసులు మృతి!

దానం పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం.. బుధవారం విచారణ, నిర్ణయం ఎటువైపు?

బడా నేతల భూ భాగోతం అవుట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాల కబ్జాపై విచారణ జరపాలి: జనసేన

RTA లో అవినీతి దందా.. 9 ఏళ్లుగా ఒకే చోట తిష్ట!

పరీక్షల పేరుతో రక్తం పిండుతున్నారా? హుజూరాబాద్‌లో కార్మికుల శాంపిళ్ల సేకరణపై వివాదం!

తల లేదు, కాళ్లు లేవు… NTTPS కాలువలో కట్ చేసిన మొండం! అసలు ఎవరా మహిళ?

Big Stories

Advertisement
×