E-Paper
Advertisement

ఇండియాలో మాయమవుతున్న 1 BHK ఇళ్లు.. డిమాండ్ ఉన్నా నిర్మాణాలు తక్కువ.. కారణాలు ఇవే

ఇండియాలో మాయమవుతున్న 1 BHK ఇళ్లు.. డిమాండ్ ఉన్నా నిర్మాణాలు తక్కువ.. కారణాలు ఇవే
Advertisement

1 BHK Housing Crisis India| సొంత ఇల్లు కొనాలని కలలు కనే చాలామంది బడ్జెట్ జీవులకు 1 BHK ఇళ్లు మంచి ఆప్షన్. కానీ ఇప్పుడు అలాంటి ఇళ్లు వెతకడం కష్టమవుతోంది. 1 BHK కొనాలనుకునే వారు ఉన్నారు. కానీ బిల్డర్లు మాత్రం నిర్మాణాలు చేపటడ్డం లేదు. పెద్ద ఇళ్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

అసలు 1 BHKల సంఖ్య ఎందుకు తగ్గుతోంది?

డేశంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మేజిక్ బ్రిక్స్ ప్రాప్‌ఇండెక్స్ ఏప్రిల్ – జూన్ 2026 డేటా ప్రకారం.. ఇండియాలో 13 శాతం కొనుగోలుదారులు 1 BHK ఇళ్లు కోరుకుంటున్నారు. అయితే అందుబాటులో ఉన్న మొత్తం హౌసింగ్ ఇన్వెంటరీలో 1 BHKల వాటా కేవలం 5 శాతంగా ఉంది. మరోవైపు 2 BHKలకు 42 శాతం డిమాండ్ ఉండగా, వాటి సప్లై కూడా 32 శాతం మాత్రమే ఉంది. మరోవైపు 3 BHKలకు 37 శాతం డిమాండ్ ఉండగా, మార్కెట్‌లో వాటి సప్లై 46 శాతంగా ఉంది. మూడు కంటే ఎక్కువ బెడ్‌రూమ్‌లు ఉన్న ఇళ్లకు 8 శాతం డిమాండ్ ఉంది. వాటి సప్లై మాత్రం 17 శాతంగా ఉంది. ఈ గణాంకాలు.. కొనుగోలుదారుల అవసరాలకు, మార్కెట్ సప్లైకి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నాయి.

పెద్ద ఇళ్లు ఎంచుకుంటున్న కొనుగోలుదారులు ఎందుకంటే?

Advertisement

ప్రస్తుతం కుటుంబ అవసరాలు మారడంతో కొందరు పెద్ద ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గాంధీనగర్‌కు చెందిన ఓ టీచర్.. తన కుటుంబం కోసం 3 BHK ఇల్లు కొనుగోలు చేశారు. పిల్లల చదువుకు ప్రత్యేక స్థలం, అతిథుల కోసం మరో గది కావాలని ఆయన భావించారు. పుణెలోని ఓ ఐటీ ఉద్యోగి కూడా 3 BHKను ఎంచుకున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంట్లో ప్రత్యేక ఆఫీస్ అవసరమైంది.
జైపూర్‌లో రిటైర్డ్ ఆర్మీ అధికారి నరేంద్ర శర్మ కూడా 3 BHK కొనుగోలు చేశారు. ఆయన దాన్ని ప్రధానంగా పెట్టుబడి దృష్ట్యా తీసుకున్నారు.

బిల్డర్లకు పెద్ద ఇళ్లు ఎందుకు ఆకర్షణీయంగా మారాయి?

బిల్డర్లకు భూమి, నిర్మాణం, అనుమతులు, ఇతర ఖర్చులు భారీగా ఉంటాయి. ఇల్లు చిన్నదిగా చేసినంత మాత్రాన ఈ ఖర్చులు అదే స్థాయిలో తగ్గవు. అయితే పెద్ద అపార్ట్‌మెంట్‌ను ఎక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంటుంది. 2 BHK, 3 BHK ఇళ్లకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ కనిపిస్తోంది. అందుకే పెద్ద ఇళ్ల నిర్మాణం బిల్డర్లకు ఆర్థికంగా ఆకర్షణీయంగా మారుతోంది.

చిన్న ఇళ్లపై పెరుగుతున్న ఖర్చుల ప్రభావం

Advertisement

ANAROCK ప్రకారం.. రూ.40 లక్షలలోపు ఇళ్లను సాధారణంగా అఫోర్డబుల్ హౌసింగ్ విభాగంలో చూస్తారు. ఈ విభాగంలో డిమాండ్, సప్లై రెండింటిలోనూ ఒత్తిడి కనిపిస్తోంది. పెరుగుతున్న భూమి, నిర్మాణం, నిబంధనల ఖర్చులు బిల్డర్లపై భారం పెంచుతున్నాయి. అఫోర్డబుల్ ప్రాజెక్టుల్లో (చిన్న ఇళ్ల నిర్మాణాలు) లాభాల మార్జిన్ సుమారు 10-12 శాతంగా ఉండవచ్చు. ప్రీమియం ఇళ్లలో ఈ మార్జిన్ 25-30 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. అందుకే కొంతమంది డెవలపర్లు ఖరీదైన ప్రాజెక్టుల వైపు వెళ్తున్నారు.

Also Read: ప్రతి ఐఫోన్ విక్రయంతో శామ్‌సంగ్‌కు రూ.24,000 లాభం.. ఎలాగంటే?

1 BHKలకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోలేదు

అనారాక్ H1 2026 సర్వేలో కూడా 48 శాతం మంది 3 BHKలను ఇష్టపడినట్లు వెల్లడైంది. 38 శాతం మంది 2 BHKలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇవి వారి కోరికలు మాత్రమే వారిలో ఎక్కువ మందికి పెద్ద ఇళ్లు కొనుగోలు చేసే స్థోమత లేదు. ఈ సర్వే.. 14 నగరాల్లో 8,320 మంది కొనుగోలుదారుల అభిప్రాయాల ఆధారంగా జరిగింది. అయితే ప్రతి ఒక్కరికీ పెద్ద ఇల్లు అవసరం ఉండదు.
ఘజియాబాద్‌కు చెందిన డేటా అనలిస్ట్ సురభి మల్హోత్రా 2 BHKను పరిశీలించిన తర్వాత 1 BHKను ఎంచుకున్నారు. తక్కువ కొనుగోలు ధర, EMI, మెయింటెనెన్స్ ఖర్చులు.. వంటి ఆంశాలు పరిగణించిన తరువాత ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Also Read: యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం

1 BHKలకు ఇంకా మార్కెట్‌లో ప్రత్యేక స్థానం

పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరుగుతున్నా, 1 BHK అవసరం పూర్తిగా ముగియలేదు. చిన్న కుటుంబాలు, ఒంటరిగా ఉండేవారు, మొదటిసారి ఇల్లు కొనేవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. క్కువ బడ్జెట్‌లో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునేవారికి 1 BHK ఇప్పటికీ ముఖ్యమైన ఎంపిక. సమస్య డిమాండ్ లేకపోవడం కాదు. అందుబాటులో ఉన్న ఇళ్ల సంఖ్య తగ్గిపోవడమే. అందుకే 1 BHK.. భారత హౌసింగ్ మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగు కాలేదు. కానీ సరసమైన ధరలో సరైన 1 BHKను లభించడం మాత్రం రోజురోజుకూ కష్టమవుతోంది.

Tags

Related News

ఈ రోజు రూ.50,000 బంగారంలో పెట్టుబడి పెడితే 10 ఏళ్ల తరువాత ఎంత వస్తుంది?

40 దాటిన ఉద్యోగుల్లో పెరుగుతున్న లేఆఫ్ భయం.. కార్పొరేట్ కంపెనీల్లో ఏం జరుగుతోందంటే?

బంగారం కొనేవారికి శుభవార్త.. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మార్కెట్లో ధరలు చూద్దాం

మంచి కార్పొరేట్ జాబ్ వదిలి వ్యవసాయం.. కట్ చేస్తే రూ.కోట్ల బిజినెస్‌ చేస్తున్న యువతి

టాటా సన్స్‌లో మళ్లీ ముసలం.. ట్రస్ట్ సంచలన ప్రకటన, చంద్రశేఖరన్ నియామకం చెల్లదు

సెప్టెంబర్ 28 నుంచి సమ్మె.. అలర్టయిన ఎస్బీఐ, కస్టమర్లకు ముఖ్య గమనిక

ఆన్‌లైన్‌లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? జాగ్రత్త ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

Advertisement
×