E-Paper
Advertisement

“నేను బ్రతికే ఉన్నాను”.. సోషల్ మీడియా ట్రోల్స్ పై నటి వడివుక్కరశి ఆవేదన!

“నేను బ్రతికే ఉన్నాను”.. సోషల్ మీడియా ట్రోల్స్ పై నటి వడివుక్కరశి ఆవేదన!
Advertisement

Actress Vadivukkarasi: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం ఏ విధంగా మితిమీరిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు సృష్టిస్తూ సెలబ్రిటీలనే కాదు సామాన్యులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ హద్దులు మరింత మితిమీరిపోయాయి అని చెప్పాలి. ఏకంగా బ్రతికున్న వారి ఫోటోలకు దండలు వేసి చనిపోయారంటూ ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్.. అసలు ఆరోగ్యంగా ఉన్న నటీనటులను ఇలా చనిపోయారని.. వారి కుటుంబ సభ్యులను అభిమానులను కలవర పెడుతూ ఉండడం నిజంగా అమానవీయం. అందుకే వారు మళ్లీ బ్రతికే ఉన్నాము అని సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తే తప్ప ఈ విషయాలకు చెక్ పడడం లేదు.

సోషల్ మీడియాలో దారుణం.. బ్రతికే ఉన్నామంటున్న సెలబ్రిటీలు..

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తాము బ్రతికే ఉన్నాం రా బాబోయ్ అంటూ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక తమిళ సీనియర్ నటి కూడా తాను చనిపోలేదని.. బ్రతికే ఉన్నాను.. దేవుడి దయతో ఆరోగ్యంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చిన తీరు అభిమానులను సంతోషపరిచినా.. ఈ వార్తలు స్ప్రెడ్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసేలా చేస్తున్నాయి . మరి ఆమె ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

మరణ వార్తలపై సీనియర్ నటి రియాక్షన్..

Advertisement

ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న తమిళ సీనియర్ నటి వడివుక్కరశి (Vadivukkarasi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలలో నటించి ఆకట్టుకున్న ఈమె.. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూనే.. మరొకవైపు విలనిజం పండించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే గత కొన్ని రోజులుగా సినిమాలలో కనిపించకుండా సైలెంట్ అవ్వడంతో.. ఆమె మరణించారని, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని ఇలా పలు రకాల ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా ఆమె మరణించారు అని కొన్ని పోస్ట్లు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి . అయితే ఈ వదంతులు ఆమె వరకు చేరడంతో ఆమె స్వయంగా స్పందించింది.

also read:డైలీ 10 కేజీల స్వీట్స్ తింటాను..నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టిస్తున్న కృష్ణుడు మాటలు!

దయచేసి వదంతులు నమ్మకండి..

Advertisement

నేను క్షేమంగా ఉన్నాను.. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మకండి. చాలా బాగున్నాను. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం లేదు . నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు.. అలాగే తప్పుడు వార్తల వల్ల కలిగిన అనవసరపు ఆందోళన పట్ల నేను ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాను” అంటూ మరణించినట్లు వస్తున్న వార్తలపై స్పందించి ఆమె క్లారిటీ ఇచ్చారు.

వడివుక్కరశి సినీ ప్రయాణం..

ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళ నటి అయినప్పటికీ తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషలో సుమారుగా 350 కి పైగా చిత్రాలలో నటించారు. సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా సత్తా చాటారు. 40 కి పైగా సీరియల్స్ లో నటించిన ఈమె సుమారుగా ఐదు దశాబ్దాలుగా తన నటనతో సినీ ప్రియులను అలరిస్తున్నారు. చిత్ర పరిశ్రమ లోకి రాకముందు ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ఈమె కమలహాసన్ నటించిన సిగప్పు రోజక్కల్ అనే చిత్రంలో తొలిసారి నటించారు.

Related News

ఆధార్ కార్డ్ చూపించి మరీ రియల్ ఏజ్ చెప్పేసిన వైష్ణవి చైతన్య!

విడాకుల పై కాజల్ షాకింగ్ కామెంట్స్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

బాలయ్య ‘దాదా’ నుంచి బిగ్ అప్డేట్.. థమన్ చెప్పింది ఇదే!

జైలర్ 2లో స్టార్‌ల జాతర.. రజనీకి తోడుగా ఇంతమందా?

మిర్జాపూర్‌కు సీక్వెల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే..

హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ షో..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా!

Big Stories

Advertisement
×