Hari Hara veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందే కొన్ని ప్రీమియర్ షోస్ పడ్డాయి. అయితే ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది.
మొదట ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు బీభత్సమైన అంచనాలు ఉండేవి. కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో సినిమా మీద అంచనాలు కొద్దిగా తగ్గాయి. క్రిష్ తప్పకుండా తర్వాత జ్యోతి కృష్ణ ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. జ్యోతి కృష్ణ గతంలో కూడా చాలా సినిమాలు చేశారు. కానీ అవి పెద్ద సక్సెస్ సాధించలేదు.
వెతకడానికి తప్పులు దొరకలేదు
హరిహర వీరమల్లు సినిమా విషయానికొస్తే అందరికీ ఉన్న ఏకైక కంప్లైంట్ విఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి అని. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గుర్రం మీద వెళ్తున్న సీన్ చూస్తే అందరికీ ఏదోలా అనిపించింది. అక్కడ సినిమా తేలిపోయింది అని అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. బహుశా ఇవి అన్నీ కూడా దర్శకుడు జ్యోతి కృష్ణ వరకు చేరి ఉండటం వలన దానిపైన రియాక్ట్ అయ్యారు. అందరూ ఏం చెబుతున్నారు అంటే ఒక విషయం గురించే కంప్లైంట్ చేస్తున్నారు. కానీ ఎవరూ కథ బాగోలేదు, స్క్రీన్ ప్లే బాగోలేదు అని అనడం లేదు. అంటూ క్లారిటీ ఇచ్చారు. ట్రోల్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. వెతకడానికి ఇంకో తప్పు దొరకలేదు కాబట్టి దీనిని పట్టుకున్నారు అంటూ మాట్లాడారు.
మొదటి పాన్ ఇండియా సినిమా
పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుసు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ట్రాఫిక్ రూల్స్ కూడా ఎలా ఉండాలో డిపార్ట్మెంట్ డిసైడ్ చేసేది. ఒకవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా అయిపోవడం వలన, కళ్యాణ్ సినిమాకి ఇప్పుడు అంత వైబ్ లేదు. కానీ ఈ సినిమాకి ప్రమోషన్ చేయటం వలన లాస్ట్ మినిట్ లో మంచి హై వచ్చింది. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన క్రేజ్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది అని చెప్పాలి. సినిమా రిజల్ట్ ఇంకొంచెం బాగుంది ఉంటే పవన్ స్టామినా ఏంటో దేశం మొత్తం తెలిసేది.
Also Read: Hari Hara Veeramallu: ప్రేక్షకులను థియేటర్ కు రమ్మని వేడుకుంటున్న మెగా బ్రదర్ నాగబాబు