IND Vs ENG 4th Test : మాంచెస్టర్ వేదికగా టీమిండియా (Team India) నాలుగో టెస్టులో అద్భుత పోరాటం ముందు ఇంగ్లాండ్ కాస్త వెనక్కి తగ్గింది. వాస్తవానికి టీమిండియా ఒక్క పరుగు కూడా చేయకముందే 2 వికెట్లు కోల్పోయింది. టీమిండియా ఓటమి ఖాయమని యావత్ ప్రపంచం భావించింది. కానీ టీమిండియా కీలక ఆటగాళ్లు రాహుల్, శుబ్ మన్ గిల్ అడ్డుగోడలా నిలిచి టీమిండియాకి కీలక ఇన్నింగ్స్ ఆడారు. వికెట్లు కోల్పోకుండా కాపాడారు. ఆ తరువాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా చెలరేగడంతో టీమిండియా డ్రా గా ముగించింది. శుబ్ మన్ గిల్, జడేజా, వాషింగ్టన్ సుందర్ ముగ్గురు సెంచరీలు చేశారు. దీంతో భారత్ ని ఓటమి నుంచి తప్పించారు. ఓపెనర్ రాహుల్ 90 పరుగులు చేశారు. సెంచరీ మిస్ అయింది. భారత్ 425/4 పరుగులు చేసింది.
Also Read : Nithish Kumar Reddy : SRH నుంచి ఔట్.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా ఆటగాడు..!
టీమిండియా ఆటకి ఫ్యాన్స్ ఫిదా
ఇవాళ ఐదో రోజు కావడంతో సమయం లేకపోవడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. 5వ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కచ్చితంగా గెలిస్తే.. టెస్ట్ సిరీస్ డ్రాగా ముగుస్తుంది. లేదంటే.. ఇంగ్లాండ్ సిరీస్ ని కైవసం చేసుకుంటుంది. ఇక ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ కాలి గాయంతో కూడా 54 పరుగులు చేసి అద్భుత పోరాటం కనబరిచాడు. రవీంద్ర జడేజా 20 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ కాలి గాయంతో కూడా 54 పరుగులు చేసి అద్భుత పోరాటం కనబరిచాడు. రవీంద్ర జడేజా 20 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేశారు.
ముగ్గురు సెంచరీలు.. మ్యాచ్ డ్రా
రెండవ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు శుభమన్ గిల్ (103), కేఎల్ రాహుల్ (87) అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ నాలుగో రోజు ఆటను పూర్తి రెండు సెషన్ల పాటు నిలదొక్కుకొని బ్యాటింగ్ చేశారు. ఇది భారత శిబిరంలో ఆశలు రేకెత్తించింది. అయితే, ఐదో రోజు ఆటలో వారి నిష్క్రమణ తర్వాత, రవీంద్ర జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్) కూడా అద్భుతమైన అర్ధసెంచరీలు చేసి జట్టును డ్రా దిశగా నడిపించారు. ఈ డ్రాతో సిరీస్ ఇంకా సజీవంగా ఉంది. చివరి టెస్ట్ మ్యాచ్ ఫలితంపై సిరీస్ విజేత ఆధారపడి ఉంటుంది. భారత జట్టు ఈ డ్రాను ఒక విజయంగా భావించి, చివరి టెస్ట్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని ఆశిస్తోంది.