Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటేనే చాలా హడావిడిగా ఉండేది. రీసెంట్ టైమ్స్ లో అది బాగా తగ్గిపోయింది అనేది వాస్తవం. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది ఒప్పుకోరు. కానీ పవన్ కళ్యాణ్ కి సినిమా మీద ఉన్న డెడికేషన్ తగ్గిపోయింది అనేది వాస్తవం.
వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఉండడం వలన రెండు తెలుగు రాష్ట్రాల యూత్ అంతా కూడా అతన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. విపరీతమైన ఫ్యాన్ బేస్ కళ్యాణ్ కు మాత్రమే సొంతం అయ్యింది. రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన పవన్ కళ్యాణ్ సినిమాల పైన దృష్టి పెట్టడం తగ్గించేశారు. దీనివలన ఫ్యాన్స్ చాలా నిరాశపడ్డారు.
థియేటర్ కు రండి
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. 23వ తారీఖున చాలా ప్రాంతాలలో ప్రీమియర్ షోస్ వేశారు. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో కంప్లైంట్ ఏమైనా ఉంది అని అంటే వి ఎఫ్ ఎక్స్ బాలేదు అని కొంతమంది కామెంట్ చేశారు. చిత్ర యూనిట్ దృష్టికి అది చేరి దానిని తొలగించారు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేటెడ్ వర్షన్ ని చిత్ర యూనిట్ ప్రజెంట్ చేసింది. అయితే ఈ అప్డేటెడ్ వెర్షన్ ని చాలామంది చూడటానికి ఇష్టపడుతున్నారు.
దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కామెంట్ చేశారు హరిహర వీరమల్లు సినిమా రేపు సాయంత్రం శరత్ సంఘం థియేటర్ వైజాగ్ దగ్గర చూడబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతేకాకుండా చాలామంది ఆడియన్స్ ని అక్కడికి రమ్మని ఇన్వైట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి నేను వస్తున్నాను అంటే సరిపోద్ది. అది పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్. బట్ ప్రేక్షకుల్ని పిలిచే పరిస్థితి వచ్చింది అని అంటే సినిమా రిజల్ట్ ఎలా ఉందో మనం ఆలోచించాల్సిన పరిస్థితి.
I will be watching @PawanKalyan ‘s Hari Hara Veera Mallu movie tomorrow evening (Monday) first show 6:30 PM at Sangam Sarath Theatre, Vizag. Come join me and let’s watch this magnum opus together on the big screen.#HariHaraVeeraMallu#BlockbusterHHVM pic.twitter.com/T3AL25yU9d
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 27, 2025
అంచనాలు ఆ సినిమాలపైనే
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండు సినిమాలు కూడా విపరీతమైన అంచనాల మీద ఉన్నాయి. దీనికి కారణం ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు అవ్వడం. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓ జి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధిస్తుంది అని చాలామంది విపరీతమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక హరీష్ శంకర్ గురించి ప్రత్యంగించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకే గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈసారి ఉస్తాద్ సినిమాతో దానిని మించి హిట్ ఇవ్వబోతున్నాడు అనేది అందరికీ ఉన్న నమ్మకం.
Also Read : Krishna Chaitanya: అందరు హీరోలను పక్కనపెట్టి సందీప్ కిషన్ తో ముందుకు వెళ్తున్న కృష్ణ చైతన్య