దీపావళి, ఛత్ పూజ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగలను నిర్వహించుకునేందుకు పలు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రైల్వే రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడుపుతున్నప్పటికీ సరిపోవడం లేదు. కన్ఫార్మ్ టికెట్లు పొందడం చాలా కష్టంగా మారింది. ఏ రైళ్లు టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా చాంతాడంత వెయిటింగ్ లిస్టు కనిపిస్తుంది. ఈ తరుణంలో ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా టికెట్లు అందించేందుకు భారతీయ రైల్వే కీలక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే వికల్ప్ స్కీమ్ ను పరిచయం చేసింది. ఈ పథకం ద్వారా కచ్చితంగా కన్ఫార్మ్ టికెట్లు పొందే అవకాశం కల్పిస్తోంది.
ప్రయాణీకులు కన్ఫర్మ్ టికెట్ పొందేందుకు ఇండియన్ రైల్వే వికల్ప్ యోజనను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కచ్చితంగా కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వికల్ప్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉన్నా.. ఆ రూట్ లో నడిచే తర్వాతి రైళ్లలో మీకు బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ సికింద్రాబాద్ నుంచి నల్లగొండ టికెట్ బుక్ చేసుకుంటే.. మీ టికెట్ వెయిటింగ్ లిస్టులో వచ్చింది అనుకుందాం. ఛార్ట్ రెడీ అయిన తర్వాత కూడా వెయిటింగ్ లిస్టులోనే ఉంటే మీరు ఆ రైలులో ప్రయాణించలేరు. క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల డబ్బులు వేస్ట్ అవుతాయి. తర్వాత రైల్లో కూడా మీరు జనరల్ టికెట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసే సమయంలో వికల్ప్ అప్షన్ మీద క్లిక్ చేసి టికెట్ బుక్ చేసుకుంటే.. ఆ మార్గంలో వెళ్లే తదుపరి రైళ్లలో మీకు కన్ఫర్మ్ టికెట్ ఇస్తారు. ఈ పథకం అన్ని రైళ్లలోనూ ఉంటుంది. ఈ స్కీమ్ కింద ప్రయాణీకులు బోర్డింగ్ స్టేషన్ నుంచి గమ్యస్థానానికి 30 నిమిషాల నుంచి 12 గంటలలోపు నడిచే 7 రైళ్లను ఎంచుకోవచ్చు. ఇలా ఎంపిక చేసుకోవడం వల్ల వీలైనంత వరకు ఏదో ఒక రైలులో టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, 100 శాతం టికెట్ కన్ఫామ్ కావాలనే రూల్ ఏమీ లేదు. ఎంచుకున్న రైళ్లలో సీట్ల లభ్యతపై ఆధారపడి టికెట్ బుకింగ్ కన్ఫార్మ్ అనేది ఉంటుంది.
Read Also: విజయవాడ రైల్వే స్టేషన్, రైళ్లలో ఆకస్మిక తనిఖీలు.. శుభ్రత పాటించనివారికి జరిమానాలు!
❂ ముందుగా IRCTC వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
❂ప్రయాణం చేయాల్సి తేదీ, గమ్యస్థానం, క్లాస్, సీటు వివరాలను నమోదు చేయాలి.
❂ ప్రయాణీకుల వివరాలను పొందుపరచాలి.
❂ ఆ తర్వాత డబ్బులు పే చేయాలి.
❂ పేమెంట్ పూర్తయ్యాక స్క్రీన్ మీద కనిపించే వికల్ప్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
❂ వెంటనే ఆల్టర్నేటివ్ ట్రైన్స్ డీటైల్స్ కనిపిస్తాయి.
❂ వాటిలో 7 రైళ్లను ఎంచుకోవచ్చు.
❂ ఏదో ఒక రైల్లో కన్ఫర్మ్ బెర్త్ లభిస్తుంది.
Read Also: రైళ్లలో రగ్గులకూ ఇక కవర్లు.. ముందుగా ఆ రైలులో అమలు!