BigTV English

SKN: గొప్ప మనసు చాటుకున్న నిర్మాత ఎస్కేయన్.. అభిమాని కుటుంబానికి అండగా!

SKN: గొప్ప మనసు చాటుకున్న నిర్మాత ఎస్కేయన్.. అభిమాని కుటుంబానికి అండగా!
Advertisement

SKN: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న వారిలో ఎస్కేయన్(SKN) ఒకరు. అల్లు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా కొనసాగుతున్న ఎస్కేయన్ గీత ఆర్ట్స్ బ్యానర్ వ్యవహారాలను చూసుకుంటూ ఉండేవారు అయితే ఇటీవల ఈయన కూడా కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు సినిమాలను నిర్మిస్తున్నారు ఇటీవల బేబీ సినిమా(Baby Movie) ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్న ఎస్కేయన్ ప్రస్తుతం పలు సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమాల పరంగా బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.


అభిమాని కుటుంబానికి అండగా..

ఇకపోతే తాజాగా మహేష్ బాబు(Mahesh Babu) వీరాభిమాని రాజేష్ అనే వ్యక్తి మరణించడంతో ఆయన స్నేహితులు రాజేష్ మరణ వార్తకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఎవరైనా తన కుటుంబాన్ని ఆదుకోవాలి అంటూ బ్యాంక్ కు సంబంధించిన కొన్ని వివరాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇక ఈ పోస్ట్ కాస్త ఎస్కేయన్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ పోస్టుపై స్పందిస్తూ సదరు అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. ఇక ఈ విషయంపై ఎస్కేఎన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..

పిల్లల చదువులు ఆగిపోకూడదు..

ఒక హీరో అభిమానిగా నేను మరొక అభిమాని భావోద్వేగాలను అర్థం చేసుకోగలను. ఈ విషయం నన్ను చాలా బాధ కలిగించింది. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యం అయితే ఈ ఘటన కారణంగా మరణించిన వ్యక్తి పిల్లల చదువులు ఆగిపోకూడదని ఈయన తెలిపారు. అందుకుగాను ఆ కుటుంబానికి నా వంతుగా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని ఎస్కేఎన్ వెల్లడించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తానని తెలిపారు. అదే విధంగా మరికొంతమందిని కూడా ఈయన సహాయం చేయమని ఈ సందర్భంగా కోరారు. ఇలా ఈ విషయంపై ఎస్కేన్ స్పందించి సహాయం చేస్తానని చెప్పడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.


చాలామందికి ఎంతో సంపద ఉంటుంది కానీ సహాయం చేసే గొప్ప మనసు ఉండదు కానీ మీరు మాత్రం సాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు అంటూ ఈయన చేసిన గొప్ప పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ఇతర ఒక సహాయం చేసే విషయంలో మీకు మరెవరు సాటిరారు,ఇలా సహాయం చేయడంలో మీ తర్వాతే మరెవరైనా అంటూ ఈయన చేసిన మంచి పని పై ప్రశంశలు కురిపిస్తున్నారు. ఇక ఈయన కూడా సినీ ఇండస్ట్రీలో మెగా,అల్లు కుటుంబానికి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. మెగా హీరోల గురించి మెగా హీరోల సినిమాల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే క్షణం కూడా ఆలోచించకుండా ఆ విషయంపై స్పందిస్తూ వారికి తనదైన శైలిలోనే సమాధానం ఇస్తూ ఉంటారు.
Also Read: Radhika Apte: హీరోలను హైలెట్ చేయడానికే సినిమాలు… హీరోయిన్లు వాటికే పరిమితమా?

Related News

Nagarjuna 100: నాగార్జున ల్యాండ్ మార్క్ మూవీ.. రంగంలోకి స్వీటీ?

‎MSVPG: మన శంకర వరప్రసాద్ గారి కోసం మరో హీరోయిన్.. ఇలా లీక్ చేసారేంటీ?

‎Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో అతనేనా? తెలుగులో ఎవరు లేరా?

Raghu Dixit : 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంటున్న సింగర్ రఘు , వధువు ఎవరో తెలుసా?

Vijaya Devarakonda: క్రేజీ కాంబో.. ఆ హిట్‌ డైరెక్టర్‌కి ఒకే చెప్పిన విజయ్‌..!

Radhika Apte: హీరోలను హైలెట్ చేయడానికే సినిమాలు… హీరోయిన్లు వాటికే పరిమితమా?

Dude Movie : డ్యూడ్ కోసం డైరెక్టర్ కన్నీటి కథ… జూబ్లీహిల్స్ రోడ్లమీద పడిగాపులు

Big Stories

×