Konda Surekha: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. కొండా సురేఖ తన బాధలను, కష్టాలను మీనాక్షి నటరాజన్‌కు క్లియర్ కట్ గా వివరించినట్టు తెలుస్తోంది.
⦿ భారం వాళ్లకే వదిలేస్తున్నా…
భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ కు తన ఇబ్బందులను షేర్ చేసుకున్నట్టు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొంత భావోద్వేగానికి గురయ్యారు. ‘నా సమస్యలను అన్నింటిని మీనాక్షి నటరాజన్ కు, మహేష్ కుమార్ గౌడ్ కు వివరించాను. నేను చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పాను. ముఖ్యంగా నా ఇబ్బందులను వివరించాను. పార్టీ పెద్దలు ప్లాబ్లెమ్స్ సెట్ చేస్తా అన్నారు. పార్టీ హైకమాండ్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది. భారం వాళ్లకే వదిలేస్తున్నాను. పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు’ అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఈ రోజు నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు అయిన విషయం తెలిసిందే.
⦿ బీసీ మహిళా అయిన నన్ను..?
అలాగే.. మంత్రి కొండా సురేఖ తనపై జరగుతోన్న కుట్రలకు సంబంధించిన విషయాలను మీనాక్షి నటరాజన్‌కు క్లియర్ కట్ గా వివరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తనను, తన ఫ్యామిలీని ఇబ్బందులకు గురి చేస్తున్న వారి పేర్లను మీనాక్షికి వివరించినట్టు సమాచారం. తన ఆవేదన అంతా చెప్పినట్టు తెలుస్తోంది. బీసీ మహిళ అయిన తనను ఎన్ని కష్టాలకు గురి చేస్తున్నారో చెప్పి.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని అడిగి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
⦿ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు..
రాష్ట్రంలో ఇతర మంత్రులతో తాను పడుతోన్న ఇబ్బందులను, కష్టాలను మీనాక్షి నటరాజన్‌కు తెలిపానని ఆమె మీడియాతో చెప్పారు. వారు కూడా తన అభ్యర్థనను విని మంత్రులతో కూర్చొని మాట్లాడి త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తన సమస్యలను అన్నింటిని వారితో పంచుకున్నానని అన్నారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన ఆదేశాల మేరకు తాను ముందుకు వెళ్తానని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
ALSO READ: Konda Surekha: భట్టితో మంత్రి కొండా సురేఖ భేటీ.. సెక్యూరిటీ లేకుండానే..?