The Raja Saab Trailer :సాధారణంగా ఎవరైనా సరే అప్పుడప్పుడు తెలియకుండా తప్పులు చేయడం సహజం. కానీ ఆ తెలియని తప్పుల కారణంగా దెబ్బకు ట్రోల్స్ అవుతారు అనడంలో సందేహం లేదు.ఆ తర్వాత మళ్లీ అప్రమత్తమయ్యి .. ఆ తప్పులను సరిచేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సరిగ్గా ఇలాంటి తప్పే డైరెక్టర్ కోనా వెంకట్ (Kona Venkat) విషయంలో కూడా జరిగింది. ఆయన ట్రైలర్ ని కాస్త టీజర్ అంటూ పోస్ట్ చేసి మళ్లీ ట్రోలర్స్ కి భయపడి వెంటనే తన తప్పును సరి చేసుకుంటూ సారీ కూడా చెప్పేశారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి(Maruti ) దర్శకత్వంలో వస్తున్న చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab). డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా రావాల్సి ఉండగా.. వీ ఎఫ్ ఎక్స్ కారణంగా సినిమాను వచ్చే యేడాది సంక్రాంతికి వాయిదా వేస్తూ కొత్త డేట్ ప్రకటించారు. అలా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్లో విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించడంతో.. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ట్రైలర్ కూడా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్ అభిమానులను విపరీతంగా మెప్పించింది కూడా.. అటు మాళవిక మోహనన్ (Malavika mohanan), రిద్దీ కుమార్ (Riddhi Kumar), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఇలా ముగ్గురు కూడా ఎవరికివారు తమ పెర్ఫార్మెన్స్ తో ట్రైలర్ కి ఊహించని ఇమేజ్ ను తెచ్చిపెట్టారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ట్రైలర్ చూసి టీజర్ అన్న కోన వెంకట్..
అయితే ఇప్పుడు డైరెక్టర్ కోనా వెంకట్ ఆ ట్రైలర్ ని చూశారేమో.. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ.. “ఇప్పుడే ది రాజాసాబ్ “టీజర్” చూశాను. నన్ను నమ్మండి. ఈ జానర్ లో ఇండియాలోనే అతిపెద్ద బ్లాక్ బాస్టర్ గా ఈ సినిమా నిలవబోతోంది. ఇందులో డార్లింగ్ ప్రభాస్ చాలా అద్భుతంగా నటించారు. డైరెక్టర్ మారుతి మీరు చాలా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాలా అద్భుతమైన క్షణాలను నేను ఆస్వాదించాను. అటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీ నిర్మాణ విలువలు అసాధారణంగా, ఊహించని విధంగా ఉన్నాయి. 2026 జనవరి 9న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక సునామి సృష్టించబడుతోంది.. సిద్ధం కండి” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
డార్లింగ్ ఫాన్స్ దెబ్బకు సారీ చెప్పిన కోనా వెంకట్..
అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఆయన ట్రైలర్ ను చూసి పోస్ట్ చేస్తూ.. టీజర్ చూడడం జరిగింది అని ట్వీట్ చేయడంతో వెంటనే పెద్ద ఎత్తున నెటిజన్స్ , డార్లింగ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కోనా వెంకట్ వెంటనే మరొక ట్వీట్ చేస్తూ.. “క్షమించండి, టీజర్ కాదు ట్రైలర్” అంటూ మళ్ళీ తన తప్పును సరి చేసుకున్నారు. మొత్తానికైతే ట్రైలర్ ను కాస్త టీజర్ అంటూ చెప్పి ఇరుక్కుపోయిన వెంకట్ డార్లింగ్ అభిమానుల దెబ్బకు భయపడిపోయి.. వెంటనే సారీ చెప్పడం ఇక్కడ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Sorry I was told that it’s a TRAILER #RajaSaabTrailer 🔥 https://t.co/Y8Z4qWHf2V
— KONA VENKAT (@konavenkat99) September 19, 2025