Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 లో మెల్లమెల్లగా ఒక్కొక్కరి క్యారెక్టర్స్ బయటపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ అందరికంటే మంచి గుర్తింపు సాధించుకున్న వ్యక్తి సుమన్ శెట్టి. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా కనిపించిన సుమన్ శెట్టి రీసెంట్ టైమ్స్ లో సినిమాలు చేయడం తగ్గించేశారు. మళ్లీ బిగ్ బాస్ షో లో కనిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. బయట ప్రేక్షకులు కూడా అతనిని విపరీతంగా ఆదరిస్తున్నారు.
ఇప్పటివరకు సుమన్ శెట్టి ఏ విషయంలో కూడా పెద్దగా బ్యాడ్ అనిపించుకోలేదు. అవసరమైతే మాట్లాడుతాడు, లేకుంటే తన పరిధిలో తాను ఉంటారు. హౌస్ మేట్స్ అందరితో కూడా మంచి బాండింగ్ సుమన్ శెట్టి కి ఉంది.
మొదటి వారంలో కెప్టెన్ అవ్వడానికి జరిగిన పోటీలో మనీష్ సంచాలక్ వ్యవహరించారు. అయితే మనీష్ అప్పుడు ఇమ్మానుయేల్ ను ఎలిమినేట్ చేశాడు. ఎలిమినేట్ చేసినందుకు వాళ్ళిద్దరికీ మధ్య విపరీతమైన ఆర్గ్యుమెంట్ నడిచింది. నువ్వు పెద్ద సంచాలక్ అంటూ ఇమ్మానుయేల్ మనీష్ ను కామెంట్ చేశాడు. ఆ తర్వాత కళ్యాణ్ కూడా టాస్క్ లో తప్పు చేస్తే మనీ సరిగ్గా చూడలేదు. మనీష్ వరస్ట్ సంచాలక్ అని అందరికీ అర్థమైంది.
కానీ ఇప్పుడు మనీష్ మించి ప్రియా శెట్టి వరస్ట్ సంచాలక్ అని తెలుస్తుంది. బిగ్బాస్ నిన్న ఒక కొత్త టాస్క్ ఇచ్చారు. ఆ టాస్కులో సుమన్ శెట్టి తను కలెక్ట్ చేసిన వస్తువులను కాపాడుకుంటున్నాడు, అవి తీసుకునే ప్రయత్నంలో సంజనను తన వస్తువులను తీసుకుంటుందేమో అని ప్రొటెక్ట్ చేసుకున్నాడు. తను ఆ వస్తువులపై కప్పిన క్లాత్ ను మాత్రమే గట్టిగా లాగే ప్రయత్నం చేశాడు.
అయితే దీనికే ప్రియా శెట్టి మీరు తనని కొట్టారు అంటూ ఎలిమినేట్ చేసేసింది. సుమన్ శెట్టి ఎలిమినేట్ కావడంతోనే తన వస్తువులను కాళ్లతో తన్నేసి పక్కకు వెళ్లిపోయాడు. సుమన్ శెట్టి అగ్రెసివ్ కొట్టాడు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం తన వస్తువులను ప్రొటెక్ట్ చేసుకున్నాడు అంటూ అంటున్నారు. దీని గురించి ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున మాట్లాడే అవకాశం ఉంది.
Also Read: OG Movie Team: ఓజీ నిర్మాతలకు బజ్ బాధలు.. ఇక ఆపేయండి అంటూ ఆవేదన