BigTV English
Advertisement

Tollywood: ప్రముఖ రచయిత కన్నుమూత.. ఏమైందంటే?

Tollywood: ప్రముఖ రచయిత కన్నుమూత.. ఏమైందంటే?

Tollywood:గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నిన్నటికి నిన్న స్టార్ సింగర్ జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ప్రాణాలు విడువగా.. ఇప్పుడు మరొక సీనియర్ రచయిత ప్రాణాలు కోల్పోవడం అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ సినీ , నాటక రచయిత ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ (Aakella Venkata Surya Narayana).


అనారోగ్య సమస్యలతో సినీ రచయిత మృతి..

గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు. చిన్నతనం నుండే నాటకాలలో నటించడం మొదలుపెట్టిన ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ.. 80కి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను, మాటలను కూడా అందించారు. ఎక్కువగా మహిళల జీవితానికి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా ఆయన రచనలు ఉంటాయి. అలాంటి ఒక గొప్ప రచయిత ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ కెరియర్..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో జానకి – రామయ్య దంపతులకు జన్మించారు. నాటకాలలో నటించడం మొదలుపెట్టిన ఈయన.. 1960లో ‘బాల రాముడి’ పాత్రలో నాటక రంగంలోకి ప్రవేశించారు. అలా చందమామ, బాలమిత్ర పత్రికలకు కథలు రాసి పంపించడం మొదలుపెట్టారు. డిగ్రీ పూర్తయిన తర్వాత తన మొదటి నవల రచించడం మొదలుపెట్టారు. సుమారు 200 కథలు.. 20 నవలలు ఆయన తన కెరియర్లో రచించడం జరిగింది. వీటిలో కొన్ని భారతీయ భాషలలోకి కూడా అనువదించడం గమనార్హం.

టీవీ సీరియల్స్ కి కూడా..

టీవీ సీరియల్స్ కి కూడా దాదాపు 800 ఎపిసోడ్స్ రాశారు. అలా సాంఘిక నాటికలు, పద్య నాటకాలు, రేడియో నాటకాలు ఇలా అన్ని విభాగాలలో కూడా ఆయన హస్తం ఉంది. 1997లో తొలిసారి కాకి ఎంగిలి అనే నాటకాన్ని రాసిన ఈయన.. ఆ తర్వాత అల్లసాని పెద్దన , రాణి రుద్రమ, రాణా ప్రతాప్ లాంటి చారిత్రక నాటకాలు కూడా రాశారు.

ఆకెళ్ళ సినిమాలు..

ఈయన కథలు అందించిన సినిమాల విషయానికొస్తే.. మగమహారాజు సినిమాతో తొలి అడుగు వేసిన ఈయన స్వాతిముత్యం, శృతిలయలు, ఆడదే ఆధారం, సిరివెన్నెల, నాగదేవత, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, అవునన్నా కాదన్నా, ఎంత బావుందో ఇలా మొత్తం 80 చిత్రాలకు కథలు అందించారు.

ALSO READ:The Raja Saab Trailer : డార్లింగ్ ఫ్యాన్స్ ట్రోల్స్… దెబ్బకు సారీ చెప్పిన డైరెక్టర్

Related News

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Chikiri Song Promo : మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Kiran Abbavaram : కె ర్యాంప్ మూవీకి లీగల్ చిక్కులు… దాన్ని కూడా వాడేస్తున్నారా?

Dharma Mahesh: పోలీసులను ఆశ్రయించిన ధర్మా మహేష్.. భార్య గౌతమీతో పాటు అతనిపై ఫిర్యాదు!

Bahubali: The Eternal War: బాహుబలి మరణం.. ముగింపు కాదు!

Big Stories

×