BigTV English

Director Krish: పవన్ తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన క్రిష్

Director Krish: పవన్ తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన క్రిష్

Director Krish: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.  ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఐదేళ్లుగా  ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా మొదలైంది.  పవన్ కళ్యాణ్-  క్రిష్ కాంబో అనగానే సినిమాపై ఎక్కడలేని హైప్ వచ్చింది. దాదాపు మూడేళ్లు క్రిష్ వీరమల్లు కోసం పని చేశాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ క్రిష్.. వీరమల్లు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత అసలు ఈ సినిమా ఫినిష్ అవ్వదు అని అనుకున్నారు. ఒక సమయంలో అసలు ఇలాంటి ఒక సినిమా ఉంది అనే విషయాన్ని కూడా అభిమానులు మర్చిపోయారు .


 

మధ్యలో పవన్ ప్రచారాలు, రాజకీయాలు, పదవులు ఇలా చాలా విషయాలు వలన వీరమల్లు షూటింగ్ ఆగుతూ వచ్చింది. ఇక క్రిష్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్న ఇండస్ట్రీ మొత్తాన్ని తొలిచివేసింది .ఆ సమయంలోనే నేనున్నాను అని అంటూ నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ముందుకు వచ్చాడు. ఏదేమైనా జ్యోతి కృష్ణ వచ్చాక వీరమల్లు ముందుకు సాగింది అని చెప్పొచ్చు.  ఒకపక్క రాజకీయాలు చేస్తూనే వీరుమల్లును ఫినిష్ చేశాడు పవన్.  ఇంత జరిగినా కూడా మధ్యలో ఎక్కడ క్రిష్ జోక్యం చేసుకోలేదు. తనపాటికి తాను ఘాటీ సినిమాతో బిజీగా మారాడు. ఇక సినిమా షూటింగ్ పూర్తవడం ఒక ఎత్తు అయితే రిలీజ్ డేట్ ప్రకటించడం మరో ఎత్తు అని చెప్పాలి ఐదేళ్లుగా ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ డేట్ లో మారుస్తూనే వస్తున్నారు. ఒక నెల కాకపోతే ఇంకొక నెల వస్తుంది వస్తుంది అంటూ ప్రేక్షకులను ఊరిస్తూనే ఉన్నారు. ఇక చివరికి జూలై 24న వీరమల్లు వస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు.


Manju Warrior: రైలు కింద పడి ఆత్మహత్య.. కొద్దిలో మిస్..

ఈసారి కచ్చితంగా పవన్ వస్తున్నాడు అని చెప్పడానికి ప్రమోషన్స్ లో కూడా పవన్ ను ఇన్వాల్వ్ చేశాడు ఏఎం రత్నం. చాలా కాలం తర్వాత పవన్ ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని అద్భుతంగా మాట్లాడి మరింత హైప్ తీసుకొచ్చాడు.  ఇక ఇదంతా పక్కన పెడితే మొదటి సగభాగం డైరెక్ట్ చేసిన క్రిష్ సంగతేంటి.. ఆయన కూడా ఈ సినిమాలో ఒక భాగమే.. ఎలాంటి విభేదాలు జరగకపోతే సినిమా గురించి ఏదైనా మాట్లాడటం గానీ, ఈవెంట్ కి రావడం గానీ చేయొచ్చు కదా. పవన్ తో క్రిష్ కు విభేదాలుతలెత్తడం వలనే ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.  అందులో ఎలాంటి నిజం లేదని క్రిష్ క్లారిటీ ఇచ్చాడు.

 

తాజాగా పవన్ కళ్యాణ్, ఏఏం రత్నం పై క్రిష్ ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా వీరమల్లు విజయం సాధించాలని కోరుకుంటూ పోస్ట్ పెట్టాడు. ”  ఇప్పుడు.. హరి హర వీర మల్లు ప్రపంచంలోకి   అడుగుపెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాదు.. ఒక మంచి ఉద్దేశ్యంతో.  ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా సాధ్యమైంది. ప్రతి ఫ్రేమ్ వెనుక చరిత్ర, వారి ఇష్టం ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ గారు.. అంతకన్నా గొప్ప శక్తి ద్వారా ఆశీర్వదించబడిన అసాధారణ శక్తి. ఆయనలో ఏ కెమెరా పూర్తిగా సంగ్రహించలేని ఒక అగ్ని ఉంది..  మంచి ఉద్దేశ్యం నుండి వచ్చే ఒక రకమైన శక్తి. ఆయన నిత్యం మండే స్ఫూర్తినే హరి హర వీరమల్లులోకి ప్రాణం పోసింది. ఆయన HHVMకి వెన్నెముక. తుఫానులా మారారు. 

 

A.M. రత్నం గారు, భారతీయ సినిమా యొక్క కొన్ని గొప్ప అనుభవాల వెనుక ఉన్న శిల్పి.  దేనినైనా ఆయన పెద్దగా చూడగలరు, ఎంత గందరగోళాన్ని అయినా ఆపగలరు. విశ్వాసంతో నిర్మించగల సామర్థ్యం ఉండడం అరుదు. HHVM ఇప్పుడు ఇలా ఉంది అంటే ఆయన అచంచలమైన బలం వల్లనే. ఈ సినిమా నాకు ఎంతో నచ్చిన పోరాటాలలో ఒకటి.. దర్శకుడిగా మాత్రమే కాదు, మరచిపోయిన చరిత్రను అన్వేషించేవాడిగా, అసౌకర్య సత్యాలను అన్వేషించేవాడిగా, ప్రపంచ నిర్మాణానికి అవకాశంగా, అన్నింటికంటే ముఖ్యంగా, వినోదాన్ని మరియు జ్ఞానోదయాన్ని అందించే సినిమాను నమ్మేవాడిగా. పవన్ కళ్యాణ్ గారు.. ఏఎం రత్నం గారు.. ఈ ఇద్దరు దిగ్గజాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతను అందిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా తయారుచేయబడిన ఈ అగ్ని ఇప్పుడు మీ ముందుకు రానుంది. ఇక ఈ సినిమా మీదే’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

 

Related News

Mollywood: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలో వైరల్!

KishkindPuri event :బెల్లంకొండ శ్రీనివాస్ కోసం ఆ ముగ్గురు దర్శకులు హాజరు

Karishma Kapoor: మాజీ భర్త ఆస్తుల కోసం పిల్లలతో కలిసి కరిష్మ బడా ప్లాన్.. రూ.30 వేల కోట్లంటే మాటలా?

Telugu Film Industry: ఒంటరైన ఆడియో సంస్థ అధినేత… ఆ ఇద్దరు బడా ప్రొడ్యూసర్లతో పూర్తిగా చెడిందా ?

Mouli: నీ లైఫ్ లో ఏమి అచీవ్మెంట్స్ రా బాబు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు కొట్టావు, ఇప్పుడు సక్సెస్ మీట్ కి ఫేవరెట్ హీరో

Megastar Chiranjeevi : ఏంటి బాసు ఇప్పటికీ నీ గ్రేసు, కొంపదీసి టైం ట్రావెల్ మిషన్ దొరికిందా?

×