BigTV English

Dog Walker: టెక్కీ కంటే డాగ్ వాకర్ బెటర్.. నెలకు జీతం ఎంతో తెలుసా?

Dog Walker: టెక్కీ కంటే డాగ్ వాకర్ బెటర్.. నెలకు జీతం ఎంతో తెలుసా?

Dog Walker: దేశంలో చాలా కాలంగా వృత్తి పరమైన రంగాలు క్రమంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అందుకు ఎగ్జాంఫుల్ డాగ్ వాకర్ కథ. ఇదేంటి అనుకుంటున్నారా? పైన కనిస్తున్న డాగ్ వాకర్ వ్యక్తి నెలకు జీతం ఎంతో తెలుసా? అక్షరాలా నాలుగున్నర లక్షలు. కలా? నిజామా? అనేది మీడౌట్ అక్కడికే వచ్చేద్దాం.


ఫ్యామిలీ పరంగా వస్తున్న వృత్తులను వదిలేస్తోంది నేటి యువత. తల్లిదండ్రులు సైతం పిల్లలను కష్టపడి చదివించడంతో సాఫ్ట్‌వేర్ తరహా రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు. ఫలితంగా చేతి వృత్తులకు మాంచి డిమాండ్ ఏర్పడింది. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.

తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ డాగ్ వాకర్ నెలకు నాలుగున్నర లక్షలు(రూ.4.5) సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇది వైట్ కాలర్ ఉద్యోగాలను మించిపోయింది. దేశంలో పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమ వేగంగా పుంజుకుంటోంది. ఈ మధ్య కాలంలో ఏ ఇంట్లో చూసినా కచ్చితంగా శనకాలు కనిపిస్తున్నాయి.


ఒకప్పుడు ఉన్నతస్థాయి వర్గాల్లో ఈ కల్చర్ ఉండేది. రానురాను మధ్య తరగతి కుటుంబాలకు పాకింది. ఇంట్లో భార్తభర్తలు ఉద్యోగాలు చేయడంతో వాటిని చూసేవారు కరువయ్యారు. ఫలితంగా డాగ్ వాకర్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. 2026 నాటికి దేశంలో ఈ సెక్టార్ రూ. 7,500 కోట్లు దాటుతుందని ఓ అంచనా.

ALSO READ: హైదరాబాద్‌లో భారీ ఛీటింగ్.. యువ పారిశ్రామికవేత్తలే వారి టార్గెట్

ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో పెంపుడు జంతువుల సంరక్షణకు నిపుణుల డిమాండ్ పెరిగింది. గృహిణులు సైతం పెంపుడు జంతువు ఉండాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు వాటిని చూసుకునేవారు. వారికి దూరంగా పిల్లలు ఉండటమే.. డిమాండ్‌కు కారణమని అంటున్నారు.

మీడియా రిపోర్టుల ప్రకారం గుర్తింపు వెల్లడించని ఓ వ్యక్తి.. రోజూ 38 కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తాడు. వాటి ద్వారా నెలకు రూ. 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే టెక్కీ, ఎంబీఏలు సంపాదించిన కంటే ఎక్కువన్నమాట. ఎంబీఏ పట్టా పొందిన డాగ్ వాకర్ సోదరుడు చాలా తక్కువ సంపాదిస్తున్నాడు.

చాలామంది వైద్యుల సంపాదన కంటే ఎక్కువ. రోజువారీ శునకాలను నడిపించడం కీలకం. ఒక్కో కుక్కకు సుమారు 15 వేలు ఛార్జ్ చేస్తున్నాడట. ఈ వ్యవహారంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముంబై, పూణె నగరాల్లో చాలా మంది ప్రొఫెషనల్ డాగ్ వాకర్లు ఒక్కో కుక్కకు 300 నుండి 500 వరకు వసూలు చేస్తున్నారట.

దీన్ని వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రోజుకు 10 నుంచి 15 శునకాలను ఆ విధంగా తమకు అప్పగిస్తే గ్రూప్ వాకింగ్ పేరిట సేవలు మొదలుపెట్టాలని చాలామంది భావిస్తున్నారు. ఇది కేవలం పని కాదు.. కొత్త ఉపాధికి విప్లవం అన్నమాట.

Related News

Apple iPhone 17 Released: యాపిల్ ఐఫోన్ 17 విడుదల…కళ్లు చెదిరే ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశం..ధర ఎంతంటే..?

Earth Core Gold Mine: భూమి లోపలి నుంచి ఉప్పొంగి వస్తున్న బంగారం.. దీని విలువ తెలిస్టే షాక్ అవ్వాల్సిందే..

Swiggy: కస్టమర్ షాక్.. రెస్టారెంట్‌ Vs యాప్, 81 శాతం ధర తేడా?

Gold Rate Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర..

Jio vs Airtel vs VI: జియో, ఎయిర్‌ టెల్, VI.. డైలీ డేటాలో బెస్ట్ మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!

Best BSNL Plans: నెల రోజుల వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్.. రూ. 199 లోపు 5 బెస్ట్ BSNL ప్లాన్స్ ఇవే!

×