Suryakumar Yadav Mother: భారత్ – ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరిగిన మూడవ వన్డేలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కి తీవ్ర గాయం కావడంతో సిడ్నీలోనే ఓ ఆసుపత్రిలో చేరాడు. అతడి ప్లేహనికి గాయం కావడంతో అంతర్గతంగా రక్తస్రావం జరిగి ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వెలువడ్డాయి. శ్రేయస్ అయ్యర్ కి ప్రస్తుతం శస్త్ర చికిత్స జరిగిందని.. అతడు కోలుకోవడానికి కనీసం 8 వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: Bumrah-Harshit: ఒరేయ్ పిల్ల బచ్చా.. అవేం బూట్లురా, హర్షిత్ రాణా పరువు తీసిన బుమ్రా
ప్రస్తుతం అయ్యర్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బిసిసిఐ స్పష్టం చేసింది. వైద్యులు అనుకున్న దానికంటే వేగంగా శ్రేయస్ అయ్యార్ రికవరీ అవుతున్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. డాక్టర్ రిజ్వాన్ తో నిరంతరం టచ్ లో ఉన్నామని.. భారత జట్టు వైద్యుడు కూడా సిడ్ని ఆసుపత్రిలోనే ఉన్నాడని తెలిపారు. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ ని ఐసియు నుంచి సాధారణ రూమ్ కి మార్చారని సైకియా వివరించారు.
శ్రేయస్ అయ్యర్ గాయం పై మంగళవారం రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో టి-20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “అయ్యర్ గాయపడ్డాడని తెలిసినప్పుడు అతడికి ఫోన్ చేశా. కానీ అతడి దగ్గర ఫోన్ లేదనే విషయం నాకు తర్వాత తెలిసింది. దీంతో నేను ఫిజియో కి కాల్ చేస్తే.. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపాడు. మొదటిరోజు కండిషన్ ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పలేరు. కానీ నేను రెండు రోజులుగా శ్రేయస్ అయ్యర్ తో మాట్లాడుతూనే ఉన్నాను. అతడి మాటలు వింటుంటే ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని అర్థమవుతుంది. ఇది ఓ మంచి పరిణామం. అతడు మరికొన్ని రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటాడు” అని తెలిపాడు సూర్య కుమార్ యాదవ్.
గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకోవాలని సూర్య కుమార్ యాదవ్ తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తూ.. నీటిలో నిలబడి పూజలు నిర్వహిస్తోంది. దీంతో తన కుమారుడి తోటి ఆటగాడి కోసం సూర్య కుమార్ యాదవ్ తల్లి చేస్తున్న పూజకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రీడాభిమానులు.. క్రీడా కుటుంబానికి ఇదే నిదర్శనం అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Telugu Titans: తెలుగు టైటాన్స్ అదిరిపోయే విజయం.. కోచ్ కు కన్నీళ్లు ఆగలేదు
తల్లి ప్రేమకు ఇదే నిదర్శనమని మరి కొంతమంది కొనియాడుతున్నారు. ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కి ముందు శ్రేయస్ అయ్యర్ ని వైస్ కెప్టెన్ గా నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఫెయిల్ అయిన శ్రేయస్ అయ్యర్.. రెండవ వన్డేలో హాఫ్ సెంచరీ {61} తో రాణించాడు. ఇక మూడవ వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. అతడు తిరిగి మైదానంలో అడుగు పెట్టాలంటే దాదాపు మూడు నెలల వరకు ఆగాల్సి వస్తుంది.
Suryakumar Yadav's Mother praying for Shreyas Iyer's speedy Recovery. 🥺❤️ pic.twitter.com/U6eHM2YOLS
— Johns. (@CricCrazyJohns) October 29, 2025