BigTV English

Manju Warrior: రైలు కింద పడి ఆత్మహత్య.. కొద్దిలో మిస్..

Manju Warrior: రైలు కింద పడి ఆత్మహత్య.. కొద్దిలో మిస్..

Manju Warrior: సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చేవారు మొదట్లో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా చేసేయాలి. ఎలాగైనా దర్శక నిర్మాతలను మెప్పించాలి. మొదటి సినిమాతోనే పేరు వచ్చేయాలి అని చూస్తూ ఉంటారు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఎంత కష్టం అయినా పడతారు. ఎంత రిస్క్ అయినా కూడా చేస్తారు. అది కేవలం హీరోలు మాత్రమే కాదు. హీరోయిన్లు కూడా అదే ఆతృతతో కనిపిస్తారు. ఒక హీరోయిన్ మొదటి సినిమా సమయంలో షాట్ సరిగ్గా రావాలని ఎదురుగా ట్రైన్ వస్తున్నా పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంట. పక్కనే ఉన్న నటుడు వచ్చి పక్కకు నెట్టకపోతే ఆమె రైలు కింద పడి మరణించేదట. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ? ఆమెను కాపాడిన ఆ నటుడు ఎవరు.. ? తెలుసుకుందాం రండి.


 

మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా మారి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది రిలీజైన వెట్టయాన్ సినిమాలో రజనీ కాంత్ తో మెరుపై వచ్చిండే అంటూ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ ఒక్క సాంగ్ తో అమ్మడు తమిళ్, మలయాళంలోనే కాదు తెలుగులో కూడా స్టార్ గా మారిపోయింది. 46 ఏళ్ల వయస్సులో కూడా ఆమె తన అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఇప్పుడంటే సినిమాలలో స్టంట్ లు చేయాలంటే డూప్ లు ఉండేవారు. అప్పట్లో అలా కాదు. ఏదైనా హీరో హీరోయిన్లే చేయాలి. హీరోలు అయితే కొంచెం రిస్క్ అయినా ఆ దృఢత్వం ఉంటుంది కాబట్టి ఓకే. కానీ, మొదటి సినిమాలోనే మంజు రిస్కీ షాట్స్ చేసి చిత్ర బృందాన్నే షాక్ కు గురి చేసిందట. ఈ విషయాన్ని మంజుతో నటించిన నటుడు మనోజ్ కె జయన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ స్పెషల్ థాంక్స్..ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

దిలీప్ కుమార్, మంజు వారియర్, మనోజ్ కె జయన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సల్లాపం. మంజు వారియర్ కు హీరోయిన్ గా మొదటి సినిమా. ఇక ఇందులో క్లైమాక్స్ సీన్ లో ఆమె ఆత్మహత్య చేసుకొనే సీన్ ఉంది. ఆ సీన్ కోసం మంజు చాలా రిస్క్ చేసిందని మనోజ్ చెప్పుకొచ్చాడు. ” ఈ సినిమా క్లైమాక్స్ లో మంజు .. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలి. నేను వెళ్లి కాపాడాలి. అదే సీన్. ఇక మంజు ముందు వెనకా చూసుకోకుండా ట్రైన్ పట్టాలపై నడుచుకుంటూ వెళ్లిపోతుంది. ట్రైన్ దగ్గర అయ్యేకొద్ది నా గుండెల్లో భయం మొదలైంది. ఆమె చూస్తే అస్సలు భయపడడం లేదు. ఇక కొద్ది దూరంలో ట్రైన్ ఉంది అనగా నేను వెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకొని పైకి లాగేసాను. నా ఒళ్ళంతా చెమటలు. చాలా కోపం వచ్చింది. గట్టిగా తిట్టాలనుకున్నాను. కానీ, అక్కడ ఉన్న చిత్ర బృందం మొత్తం షాట్ సూపర్ గా వచ్చిందని మెచ్చుకున్నారు. కొద్దిలో మిస్ అయ్యింది. ఒక్క క్షణం నేను ఆలస్యమైనా ఒక గొప్ప నటిని మనం మిస్ అయ్యేవాళ్ళం” అని చెప్పుకొచ్చాడు.

 

సల్లాపం సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు మంజుకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే హీరో దిలీప్ తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. ఆ తరువాత కొన్ని విభేదాల వలన వారు విడిపోయారు. ప్రస్తుత్ మంజు వరుస సినిమాలతో బిజీగా మారింది.

Related News

Bhadrakaali trailer: విజయ్ ఆంటోని 25వ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

Nayanthara: నయన్‌ను వీడని ‘చంద్రముఖి’.. నోటీసులు ఇచ్చిన నిర్మాతలు? వాస్తవం ఏమిటంటే?

Jacqueline Fernandes: చిన్నారికి అరుదైన వ్యాధి.. గొప్ప మనసు చాటుకున్న జాక్వెలిన్..

Mega Family: మెగాస్టార్ ఇంటికి వారసుడొచ్చాడు.. తల్లిదండ్రులైన లావణ్య- వరుణ్!

Manchu Lakshmi: మంచు లక్ష్మిని పట్టుకుని ఎంత మాట అనేశాడు.. అక్కడే ఇచ్చే పడేసిందిగా!

Kishkindhapuri First Review: కిష్కింధపురి ఫస్ట్ రివ్యూ… ఈసారైన బెల్లంకొండ హిట్ కొడతాడా..

Big Stories

×