Coolie: ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కూలీ. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ తో పాటు ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ హీరో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు లోకేష్ సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చాలామంది ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాయి. ఈ సినిమా వాటన్నిటిని మించి ఉండబోతుంది అని తెలుస్తుంది.
సందీప్ కిషన్ నటించిన మానగరం సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత కార్తీ హీరోగా చేసిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక రాత్రి ప్రయాణాన్ని ఆడియన్స్ ఆశ్చర్యపడేలా వెండితెరపై ఆవిష్కరించాడు లోకేష్. ఇక్కడితో లోకేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి.
కూలీ సినిమా ప్లాట్ ఇదే
సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా లోకేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా విక్రం. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సెన్సేషనల్ సక్సెస్ నమోదు చేసుకుంది. ఇప్పుడు మరో సీనియర్ హీరో రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్లాటును తెలిపాడు దర్శకుడి లోకేష్. ఈ సినిమా ప్లాట్ వచ్చి హై అండ్ లగ్జరీ వాచెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లోకేష్ ఈ మాట చెప్పిన తర్వాత అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో విడుదల చేసినప్పుడే వాచెస్ ని బాగా హైలెట్ చేశారు. ఆ ఫైట్ కూడా వాచెస్ తో కూడుకొని ఉంటుంది. అయితే ఈ కాన్సెప్ట్ పైన లోకేష్ ఈ సినిమాను ఎలా డిజైన్ చేశాడు అనే క్యూరియాసిటీ పెరుగుతుంది.
ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు
చాలామంది ఆడియన్స్ ఈ సినిమా గురించి ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా ఆల్బమ్ కూడా మంచి సక్సెస్ సాధించింది. అనిరుద్ అందించిన మ్యూజిక్ సినిమా మీద విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. వచ్చిన మూడు పాటలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి. రజనీకాంత్ సినిమాకి అనిరుద్ ఏ స్థాయిలో సంగీతం అందిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే బ్లాక్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి. ఇంకో పది సినిమాలు రజనీకాంత్ తో చేసిన అదే స్థాయిలో మ్యూజిక్ అందిస్తాడు అనిరుద్.