Raghuvaran Son Rishivaran: నటుడు రఘువర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటూ చూడు అంటూ భాషా చిత్రంలో మార్క్ ఆంటోని పాత్రతో మార్క్ సెట్ చేశారు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. వెండితెరపై విలన్, తండ్రి పాత్రల్లో పోషించి తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా ఆయన వాయిస్ డైలాగ్ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. సుస్వాగతంలో ఆయన చేసిన తండ్రి పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.
విలన్ గా వెండితెరపై మార్క్
తొలుత హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత విలన్ రోల్స్ తో అదరగొట్టారు. అలా తండ్రి పాత్రలో ఆయన ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలు చేసిన ఆయన 2008లో మరణించారు. ఆటాడిస్తాలో చివరిగా వెండితెరపై అలరించిన ఆయన అదే ఏడాది అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అయితే రఘువరన్, నటి రోహిణిలు భార్యభర్తలు అనే విషయం తెలిసిందే. 1996లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం అన్యోన్యంగా జీవించారు. 2000లో వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. అతడి పేరు రిషి వరన్. వైవాహిక జీవితంలో విభేదాలు కారణంగా 2004లో విడాకులు అయ్యాయి.
తండ్రి బాటలో కాకుండా..
అప్పటి నుంచి రోహిణి రఘువరన్ కు దూరంగా కొడుకుతో ఒంటరిగా జీవిస్తోంది. అయితే రిషి మాత్రం తండ్రి చాలా ప్రేమ అట. అయితే తండ్రి బాటలో నటుడు కాకుండ సంగీతాన్ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం సంగీతం నేర్చుకుంటున్న రిషి ఇంగ్లీష్ లో పలు అల్భమ్స్ చేసి విడుదల చేశారు. ఆ మధ్య 2018లో సొంతంగా ఓ అల్బమ్ చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశాడు. అప్పట్లో రిషి పేరు మారుమ్రోగింది. తండ్రిని మించిన కొడుకు అంటూ రిషిపై ప్రశంసలు కురిసాయి. అప్పట్లో కొడుకు ఫోటోలు షేర్ చేస్తూ నటి రోహిణి తల్లిగా తెగ మురిసిపోయింది. చాలా కాలం తర్వాత రిషి ఇంగ్లీష్ లో మరో అల్భమ్ విడుదల చేయబోతున్నాడు.
హాట్ టాపిక్ గా రిషి వరన్
ఈ సందర్భంగా అతడు మరోసారి ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారాడు. దీంతో ఇప్పుడు మరోసారి రిషి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ప్రస్తుతం అతడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నటి రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తోంది. హీరోహీరోయిన్లకు తల్లిగా, అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో మెరుస్తోంది. రోహిణి చేసిన ఎన్నో తల్లి పాత్రలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. ఎమోషనల్ సీన్స్ ఆమె చెప్పే డైలాగ్స్ భావోద్వేగానికి గురి చేస్తాయి. అందుకే మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో రోహిణి కోసం ప్రత్యేకం తల్లి పాత్రలను డిజైన్ చేస్తుంటారు దర్శక–నిర్మాతలు.
Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్‌లో పవన్ డ్యాన్స్… నిర్మాత SKN ట్వీట్‌పై పేలుతున్న ట్రోల్స్