E-Paper
Advertisement

SSMB29 : ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడనిది చూస్తారు, రాజమౌళి మహేష్ సినిమా గురించి సెంథిల్ క్రేజీ అప్డేట్

SSMB29 : ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడనిది చూస్తారు, రాజమౌళి మహేష్ సినిమా గురించి సెంథిల్ క్రేజీ అప్డేట్
Advertisement

SSMB29 : ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న సినిమా SSMB29. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు.

ఇప్పటివరకు మహేష్ బాబు తెలుగులో మినహాయిస్తే మరో భాషలో సినిమాను చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఇక రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో ఆ క్రేజీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

నెవర్ బిఫోర్ కంటెంట్ 

ఇప్పటివరకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. సెంథిల్ ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజమౌళి సినిమాలలో అతని సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వాళ్ళిద్దరికీ మధ్య అంత బాగా సింక్ కుదిరింది. అయితే ఈ సినిమాకి సెంథిల్ పని చేయడం లేదు. మరో సినిమాటోగ్రాఫర్ తో రాజమౌళి ముందుకు వెళ్తున్నారు. దీని గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యారు సెంథిల్. ఈ సినిమా మొదలుపెట్టడానికంటే ముందు ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత నెక్స్ట్ సినిమా వేరే వాళ్ళతో వెళ్ళబోతున్నాము అని ముందే చెప్పారట. అలానే ఈ సినిమాకి సంబంధించిన సెట్స్లోకి సెంథిల్ రెండుసార్లు వెళ్లారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడనిది ఈ సినిమాలో ఉండబోతుంది అంటూ సెంథిల్ ఈ సినిమా పైన నమ్మకాన్ని తెలియజేశారు.

Advertisement

మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ 

ప్రస్తుతం సెంథిల్ చెప్పిన మాటలతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. గుంటూరు కారం సినిమా తర్వాత ఇప్పటివరకు మహేష్ నుంచి ఒక సినిమా కూడా రాలేదు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించలేదు అనే విషయం తెలిసిందే. కానీ టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటుంది. ఈ సినిమా ఇప్పుడు వచ్చుంటే బాగున్ను అని చాలామంది పలు సందర్భాల్లో అనుకున్నారు. థియేటర్లో రిలీజ్ కాబోయే ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఆగస్టు 9న తెలుస్తుంది.

Also Read: Vijay Devarakonda: మీరు మారిపోయారు సార్, మాటల్లో ఎంతో మార్పు

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×