BigTV English

Mahesh Tambe : టీ20 చరిత్రలో వరల్డ్ రికార్డు.. 8బంతుల్లో 5 వికెట్లు.. మహేష్ తాంబే సంచలనం

Mahesh Tambe :  టీ20 చరిత్రలో వరల్డ్ రికార్డు.. 8బంతుల్లో 5 వికెట్లు.. మహేష్ తాంబే సంచలనం

Mahesh Tambe :  సాధారాణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏ క్రికెటర్ రికార్డు నమోదు చేసుకుంటాడో కనిపెట్టడం కష్టమైన పనే అని చెప్పాలి. ఎందుకంటే..? ఇవాళ ఓ క్రీడాకారుడు నమోదు చేసిన రికార్డును కొద్ది రోజుల్లోనే మరో క్రికెటర్ బ్రేక్ చేస్తుంటాడు. తాజాగా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. క్రికెట్ అభిమానులు సైతం ఆశ్యర్యపోయేలా ఫిన్ లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన బౌలర్ మహేష్ తాంబే అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. ఎస్టోనియా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోొ కేవలం 8 బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. టీ–20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 5 వికెట్లు తీసిన బౌలర్‌గా మహేష్ తాంబే ప్రపంచ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి ఆయన కేవలం 2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. గతంలో ఈ రికార్డు బహ్రెయిన్‌కు చెందిన జునైద్ అజీజ్ పేరిట ఉండేది. ఆయన 2022లో జర్మనీపై 10 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టారు. కానీ మహేష్ తాంబే అంతకంటే తక్కువ బంతుల్లోనే ఈ రికార్డు పూర్తి చేశాడు.


Also Read :  Windies vs Australia T20 series: విండీస్ కోట బద్దలు కొట్టిన కంగారులు.. మొత్తం ఐదుకు ఐదు

మహేష్ తాంబే 5 వికెట్లు అదుర్స్ 


ఆదివారం జరిగిన ఫిన్‌లాండ్ వర్సెస్ ఎస్టోనియా మూడో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్టోనియా 19.4 ఓవర్లలో 141 పరుగులు చేసింది. ఒకానొక దశలో ఎస్టోనియా 14.3 ఓవర్లలో 104 పరుగులు చేసి, 8 వికెట్లు చేతిలో ఉండటంతో మంచి స్థితిలో ఉంది. కానీ మసూద్ మూడో వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత వికెట్లు వరుసగా పడిపోయాయి. మహేష్ తాంబేతో పాటు జునైద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, అమ్జాద్ షేర్, అఖిల్ అర్జునం, మాధవ ఒక్కో వికెట్ పడగొట్టారు. తాంబే కేవలం 8 బంతుల్లోనే 5 వికెట్ల ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. అతను 5 వికెట్లు పడగొట్టిన బ్యాట్స్‌మెన్‌లు – స్టెఫెన్ గోచ్, సాహిల్ చౌహాన్, ముహమ్మద్ ఉస్మాన్, రూపమ్ బారువా, ప్రణయ్ గీవాలా. ఫిన్‌లాండ్ జట్టు 142 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో ఛేదించి విజయం సాధించింది.

అరవింద్ మోహన్ కీలక పాత్ర 

అరవింద్ మోహన్ 60 బంతుల్లో 1 సిక్స్, 6 ఫోర్లతో అజేయంగా 67 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇది నిర్ణయాత్మక మ్యాచ్. ఈ విజయం ఫిన్‌లాండ్‌కు 2-1 తేడాతో సిరీస్‌ను అందించింది.  39 ఏళ్ల మహేష్ తాంబే 2021లో ఫిన్‌లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు అతను 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తాంబే తన టీ20 కెరీర్‌లో మొదటిసారిగా 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. అది కూడా ప్రపంచ రికార్డు సృష్టిస్తూ కావడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో మహేష్ తాంబే క్రికెట్ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందాడు. దీంతో అతను ఐపీఎల్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

 

Related News

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Pakistan Cricketer : ఇంగ్లాండ్ ను ఓడించేందుకు వాజిలిన్ వాడారు…. భారత బౌలర్ల పై పాక్ సంచలన ఆరోపణలు

Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Jasprit Bumrah: టీమిండియాకు దరిద్రంగా మారిన బుమ్రా.. అతడు ఆడితే ఓటమే.. ఇదిగో లెక్కలు!

Big Stories

×