Prabhas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చూసిన దేశం మొత్తం ఎదురు చూస్తారు. ఇప్పటికే ప్రభాస్ కెరియర్ లో దాదాపు 1000 కోట్లు దాటిన సినిమాలు రెండు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలో చేస్తున్నాడు ప్రభాస్.
ఇంకా ప్రభాస్ విషయానికొస్తే అతను ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా రోజులైంది. బుజ్జిగాడు డార్లింగ్ వంటి సినిమాల తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్న సినిమా చేయలేదు. అయితే మారుతి ప్రభాస్ ను డైరెక్షన్ చేసే అవకాశం వస్తే ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్న సినిమా తీస్తాను అని చెప్పాడు. అదే మాదిరిగానే సినిమాను తీస్తున్నాడు మారుతి.
రాజా సాబ్ సెట్స్ లోకి పూరి జగన్నాథ్
ఇక ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. అయితే ఈ సినిమా సెట్స్ కు పూరి జగన్నాథ్ మరియు చార్మి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదివరకే ప్రభాస్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలో ఊహించిన స్థాయిలో ఆడకపోయినా కూడా ప్రభాస్ ఫిల్మోగ్రఫీలో ఆ సినిమాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రభాస్ కి కూడా ఆ రెండు సినిమాలు ప్రత్యేకము. ప్రభాస్ తో పూరి జగన్నాథ్ కి మంచి బాండింగ్ ఉంది. గతంలో ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాకి ప్రభాస్ ముందుకు వచ్చి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా చేశాడు.
డార్లింగ్ అని పిలవడం అక్కడే మొదలు
మామూలుగా ప్రభాస్ బుజ్జిగాడు సినిమా షూటింగ్ టైంలో పూరి జగన్నాథ్ ను డార్లింగ్ అని పిలిచేవాడు. అయితే ఆ పిలుపు కూడా పూరి జగన్నాథ్ కి బాగా నచ్చింది. ఒక తరుణంలో తను మాత్రమే డార్లింగ్ అని పిలుస్తున్నాడు అని అనుకునేవాడు పూరి జగన్నాథ్. కానీ ప్రభాస్ అందరిని అలానే పిలుస్తాడు అని కొన్ని రోజులు తర్వాత రియలైజ్ అయ్యాడు. ఇదే విషయాన్ని పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కూడా హైదరాబాదులోనే జరుగుతుంది.
DARLINGs Forever ❤️❤️❤️
Dashing Director #PuriJagannadh and @Charmmeofficial met Rebel star #Prabhas at the sets of #RajaSaab ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/NX5truFPUe
— BA Raju's Team (@baraju_SuperHit) July 29, 2025