Tollywood: కోర్ట్.. చిన్న సినిమాగా వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అతి తక్కువ సమయంలోనే ఇందులో నటించిన నటీనటులకు కూడా ఊహించని పాపులారిటీ లభించింది. ముఖ్యంగా పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఈ సినిమాపై.. ఈ సినిమాలో నటించిన నటీనటులపై ప్రశంసలు కురిపించారు. నేచురల్ స్టార్ నాని (Nani ) నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. పైగా కొత్త దర్శకుడు రామ్ జగదీష్ (Ram jagadeesh) ఈ సినిమాను తెరకెక్కించా. రు అయినా సరే అద్భుతమైన దర్శకత్వ మెలుకువలతో ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించారు. పోక్సో చట్టం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
ఇందులో కాకినాడ శ్రీదేవి (Kakinada sridevi), హర్ష్ రోషన్ (Harsh Roshan) జంటగా నటించారు. ఇకపోతే వీళ్ళిద్దరూ కూడా తమ పాత్రలలో సహజమైన నటనతో సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు. అలాంటి ఈ జోడి ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు టైటిల్ ను రిలీజ్ చేస్తూ ఒక గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. అదే ‘బ్యాండ్ మేళం’. ప్రముఖ దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
బ్యాండ్ మేళం టైటిల్ గ్లింప్స్..
ఇక తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే.. గ్లింప్స్ మొదలవ్వగానే..” రాజమ్మా అంటూ యాదగిరి పిలిచే పిలుపుతో ఇది ప్రారంభం అవుతుంది. తర్వాత బావ మరదళ్ల సంభాషణతో గ్లింప్స్ ను చాలా ఆసక్తికరంగా ముందుకు సాగించారు. నీకోసం కొత్త ట్యూన్ సేసినా అని యాదగిరి అనగా.. నా కోసమా సరే షురూ జెయ్ అని రాజమ్మ అంటుంది. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనిపిస్తది సూడు” అంటూ పక్కా తెలంగాణ యాసలో ఈ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఇది ప్రస్తుతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ చిత్రానికి కూడా విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కలయికలో వస్తున్న ఈ సినిమా మరో బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ALSO READ:Rukmini Vasanth: అతనిపై మనసు పారేసుకున్న రుక్మిణీ వసంత్.. బిగ్గెస్ట్ క్రష్ అంటూ!