Rukmini Vasanth:రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth).. ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచిన కుర్రాళ్ల ఫేవరెట్ క్రష్ అనడంలో సందేహం లేదు. తన నటనతోనే కాదు అందంతో కూడా అందరినీ మెస్మరైజ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా ఏ. ఆర్.మురుగదాస్ (AR Muragadas) దర్శకత్వంలో ‘మదరాసి’ అనే సినిమాలో నటించిన రుక్మిణి వసంత్.. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ డిజాస్టర్ గా నడిచింది. ఇందులో కథ, కథనం బలంగా లేకపోవడం వల్లే సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా డిజాస్టర్ అయిన కూడా ఈమె ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. అలాగే ‘కేజీఎఫ్’ చిత్రాలతో సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ హీరో యష్(Yash ) హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు మరో రెండు బడా ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు తన బిగ్గెస్ట్ క్రష్ ఎవరో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి రుక్మిణీ వసంత్ మనసు దోచుకున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..
నా కళ్ళు ఎప్పుడూ ఆయనను వెతుకుతూనే ఉంటాయి..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె హీరో యశ్ పై ఊహించని కామెంట్లు చేసింది . రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ.. “నా బిగ్గెస్ట్ క్రష్ యశ్. కే జి ఎఫ్ నుంచి ఆయన మీ అందరికీ తెలుసు. కానీ అంతకు ముందు నుంచే నాకు యశ్ అంటే ఎనలేని ఇష్టం ముఖ్యంగా నా కళ్ళు ఎప్పుడు ఆయనను వెతుకుతూనే ఉంటాయి. ఆయనతో వర్క్ చేయడం నిజంగా సంతోషంగా అనిపిస్తోంది ” అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే యువత క్రష్ గా పేరు సొంతం చేసుకున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు తన బిగ్గెస్ట్ క్రష్ యశ్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి టాక్సిక్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ALSO READ:Anurag Kashyap: వార్ 2 నిర్మాతలపై బాలీవుడ్ డైరెక్టర్ అసహనం.. ఆ టాలెంట్ లేదంటూ!
రుక్మిణీ వసంత్ ప్రారంభ జీవితం..
రుక్మిణీ వసంత్ ప్రారంభ జీవిత విషయానికొస్తే.. 1994 డిసెంబర్ 10న కర్ణాటకలోని బెంగళూరులో కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్.. ఈయన శాంతికాల సైనిక అలంకరణ అయిన అశోక చక్ర.. కర్ణాటక రాష్ట్రం నుండి పొందిన మొదటి వ్యక్తిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈమె లండన్ లోని బ్లూమ్స్ బరీలోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో నటనలో పట్టా అందుకుంది.
రుక్మిణీ వసంత్ సినిమాలు..
తొలిసారి 2019లో బీర్బల్ ట్రైయాలజీ కేస్1: ఫైండింగ్ వజ్రముని సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె తెలుగులో సప్త సాగరాలు దాచేయేల్లో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఇది కన్నడ రీమేక్ చిత్రం కావడం గమనార్హం. 2024లో నిఖిల్ హీరోగా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో తొలి తెలుగు చిత్రం చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.