Manchu Lakshmi: మంచు లక్ష్మీ (Manchu Lakshmi) .. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించడానికి సిద్ధం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ‘దక్ష’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషన్స్ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ఈ ముద్దుగుమ్మ.. సమంత(Samantha) కు అవకాశాలు ఇవ్వకపోవడంపై ఊహించని కామెంట్లు చేసింది.
ఇంటర్వ్యూలో భాగంగా మంచు లక్ష్మి రిపోర్టర్ ప్రశ్నలకు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఊహించని కామెంట్లు చేసింది. అందులో భాగంగానే మంచు లక్ష్మీ మాట్లాడుతూ..”మహిళలు సమాజంలో పురుషుల కంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతెందుకు ఒక సూపర్ స్టార్ మాజీ భార్య ఇక్కడ పనిచేస్తోంది. ఆమె విడాకులు కూడా తీసుకుంది. దీంతో ముందు సైన్ చేసిన సినిమాలను కూడా ఆమె చేతిలో నుండి లాగేసుకున్నారు. అడిగితే వద్దులే.. ఏమైనా అంటారేమో.. అని ఆమెకే చెబుతూ ఉండడం చూస్తే అవతలి వ్యక్తులకు ఈ నిర్మాతలు ఎంతలా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆమె మంచి పని చేయడానికి ఎదురుచూస్తోంది.. ఆమె ఎవరో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ నేను ప్రత్యేకంగా ఆమె పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను” అంటూ మంచు లక్ష్మి కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
మహిళలపై వివక్ష చూపిస్తున్నారు అంటున్న మంచు లక్ష్మీ..
ఇకపోతే రిపోర్టర్ అంతటితో ఆగకుండా సమంత గురించి మీరు చెబుతున్నారా? అని స్పష్టంగా అడగగా.. మంచు లక్ష్మీ ఆ విషయాన్ని నిర్ధారించడానికి వెనుకడుగు వేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ..” మీరందరూ నేను చెప్పేది సమంత గురించి అనుకుంటున్నారు. కానీ సమంత ఒక్కతే కాదు కదా.. ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ మరొకరు లేరా.. ఐదు నుండి ఆరుగురు విడాకులు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజ్. కానీ నేను ఒక్కరినే టార్గెట్ చేయడం లేదు. నా ఉద్దేశం ఏమిటంటే ఒక పురుషుడు మాత్రం ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదుర్కోవడం లేదు.. ఆడవారికే ఎందుకు ఈ సమస్యలు అంటూ నా అభిప్రాయంగా తెలిపాను” అంటూ మంచు లక్ష్మి తెలిపింది.
స్వేచ్ఛ ఇవ్వరు తీసుకోవాలి..
ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలో అయినా సరే విడాకులు తీసుకున్న భార్యాభర్తల మధ్య భార్యను చులకనగా చూస్తున్నారు కానీ భర్తకు ఎలాంటి నష్టం జరగడం లేదు. ముఖ్యంగా ఒక మహిళ విషయంలో ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు , అత్తమామలు ఉంటారు. ఎన్నో బాధ్యతలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.అందుకే ఎవరూ మనకు స్వేచ్ఛను ఇవ్వరు. కాబట్టి మనమే ఆ స్వేచ్ఛను తీసుకోవాలి అంటూ మంచు లక్ష్మి ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సమంత కెరియర్..
సమంత విషయానికి వస్తే.. ‘ఏ మాయ చేసావే’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. అదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డ ఈమెకు.. ఇప్పుడు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు అనేది వాస్తవమని చెప్పవచ్చు.
ALSO READ:BVS Ravi: తేజ సజ్జా ఒక వ్యసనపరుడు.. హాట్ కామెంట్స్ చేసిన డైరెక్టర్!