Mirai Collections : హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా మరో సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేసాడు. యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ సినిమా చేశాడు. ఈ నెల 12 న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది.. విజువల్ వండర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. పాజిటివ్ టాక్ తో పాటుగా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ హీరో తేజా, విలన్ మంచు మనోజ్ తమ పోస్టర్స్ తో 100 కోట్లు వసూళ్లు సాధించినట్లు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి దీనిపై ఈ మూవీ టీమ్ రెస్పాండ్ అవుతుందేమో చూడాలి..
సెప్టెంబర్ 12 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. విజువల్స్ తో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పాజిటివ్ టాక్ తో పాటుగా మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. మొదటి షో నుంచి కలెక్షన్ల ఊచకోత మొదలైంది.. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 18 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక రెండో రోజు కూడా భారీగానే ఓపెనింగ్స్ జరిగాయి. 55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. మూడు రోజులకు గాను 68 కోట్లు వసూళ్లను అందుకుంది. ఐదు రోజులకు గాను 100 కోట్లు వసూల్ చేసినట్లు పోస్టర్స్ సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతున్నాయి.. నాలుగురి రోజుల కలెక్షన్స్ చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇదే జోరు కొనసాగితే మాత్రం హనుమాన్ రికార్డ్ ను బ్రేక్ చెయ్యడం పక్కా అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కింది..అలాగే రితీక నాయక్ హీరోయిన్‌గా నటించారు. జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. టెక్నీషియన్లు, మ్యూజిక్, నటీనటుల రెమ్యూనిరేషన్ మొత్తం కలిపి 60 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వడానికి 65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాలి.. బడ్జెట్ పెట్టిన దానికి ఎక్కువే వసూల్ అయ్యాయి..
Also Read:
తినడం కోసమే బిగ్ బాస్ కు వస్తారా? భరణిపై ఎందుకు అంత పగ..?
విజువల్స్ తో సినిమాను ముందుకు తీసుకొని వచ్చాడు.. అశోకుడు రాసిన 9 గ్రంధాల గురించి ఈ కథ సాగుతుంది. ఆ గ్రంధాలను దక్కించుకోవాలన్న ఆశను హీరో ఎలా అడ్డుకున్నాడు అనేది మిరాయ్ కథ. దానికి ఫాంటసీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ను మేళవించి యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఇక క్లైమాక్స్ లో శ్రీరాముడి ఎలిమెంట్ ను ఇంప్లిమెంట్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే.. అంతా కలిపి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హనుమాన్ ను మించిన సీన్లు ఉండటమే ప్లస్ అయ్యింది. ఇదే జోరులో ముందుకు వెళ్తే 500 కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.. చూద్దాం ఫైనల్ గా ఎన్ని కోట్లు వసూల్ రాబడుతుందో…