Kadapa: కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. సిద్దవటం మండలం భాకరాపేట్ కల్వర్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బద్వేలు డిపోకు చెందిన ఆర్డినరీ ఆర్టీసీ బస్సు కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలవగా, కండక్టర్ చేయి విరిగింది. బస్సులోని ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న బెటాలియన్ పోలీసులు అద్దాలను పగులగొట్టి బస్సులోని ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీశారు. ప్రయాణీలకు ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: కీచక బాబాయ్.. కూతురు వరసయ్యే అమ్మాయికి లైంగిక వేదింపులు
భారీ వర్షానికి మట్టిదారి బురదమయం.. అదుపు తప్పిన బస్సు బోల్తా..
వారం రోజుల క్రితం బద్వేలు – కడప రహదారిలో కల్వర్టు కూలింది. దీంతో ఈ రహదారి గుండా తాత్కాలిక రాకపోకల కోసం కల్వర్టు పక్కన మట్టి దారి ఏర్పాటు చేశారు. రాత్రి కురిసిన వర్షానికి మట్టి దారి బురదమయంగా మారింది. మట్టి దారిలో వెళ్తుండగా.. అదుపు తప్పిన బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనకు మట్టి రోడ్డు కారణమా.. లేదా డ్రైవర్ నిర్లక్ష్యమ అనేది ఇంకా తెలియాల్సి ఉంది.