BigTV English

Suman Setty House : సుమన్ శెట్టి ఇంట్లో ఈ డైరెక్టర్‌కు స్పెషల్ రూం.. బిగ్ సీక్రెట్ రివీల్!

Suman Setty House : సుమన్ శెట్టి ఇంట్లో ఈ డైరెక్టర్‌కు స్పెషల్ రూం.. బిగ్ సీక్రెట్ రివీల్!

Suman Setty House :కమెడియన్ సుమన్ శెట్టి (Suman Shetty) అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన నటుడే.. ఈయన ఎన్నో సినిమాల్లో తన యాక్టింగ్ తో నవ్వులు పూయించారు. అయితే అలాంటి సుమన్ శెట్టి తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ కి రాకముందు గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో తనకు లైఫ్ ఇచ్చిన వారి గురించి చెప్పుకుంటూ సుమన్ శెట్టి ఎమోషనల్ అయ్యారు. వారిలో డైరెక్టర్ తేజ (Director Teja) ముందుంటారని చెప్పారు. అంతేకాదు డైరెక్టర్ తేజ కోసం తన ఇంట్లో ఒక స్పెషల్ రూమ్ కూడా నిర్మించినట్టు తెలియజేశారు.


డైరెక్టర్ కోసం స్పెషల్ రూమ్ కట్టిన సుమన్ శెట్టి.

అయితే ఈ స్పెషల్ రూమ్ కట్టడం వెనుక మరో కారణం ఉందట. అదేంటో డైరెక్టర్ తేజ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మరి సుమన్ శెట్టి ఇంట్లో ఒక స్పెషల్ రూమ్ తన కోసం నిర్మించమని తేజ ఎందుకు చెప్పారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. డైరెక్టర్ తేజ ఎంతోమంది కొత్త వాళ్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇప్పటివరకు ఆయన దాదాపు 1,163 మంది కొత్తవారిని అంటే మ్యూజిక్ డైరెక్టర్లను, కమెడియన్లను, యాక్టర్లను, హీరోయిన్ లను ఇలా ఎంతోమందిని పరిచయం చేశారట. వారిలో గోపీచంద్,ఆర్పి పట్నాయక్,నితిన్, సుమన్ శెట్టి, కాజల్, నవదీప్,ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీరందరితో కూడా తేజకి మంచి బాండింగ్ ఉంది.

డైరెక్టర్ కాళ్లు మొక్కే ప్రయత్నం చేసిన సుమన్ శెట్టి..


అయితే వీరందరూ గురించి పక్కన పెడితే.. కమెడియన్ గా తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తేజకి ఎప్పటికీ రుణపడి ఉంటానని.. సుమన్ శెట్టి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. అలా సుమన్ శెట్టికి సినిమాల్లో ఆఫర్స్ బాగా వస్తున్న టైంలో ఒక మంచి సైట్ చూసుకొని ఇల్లు కట్టుకోమని తేజ సజేషన్ ఇచ్చారట.చెప్పినట్లే సుమన్ శెట్టి ఒక సైట్ చూసుకొని మంచి ఇల్లు నిర్మించుకోవాలనుకున్నారట. అలా ఇల్లు కట్టే ముందు తేజ దగ్గరికి వెళ్లి ఇదంతా మీరిచ్చిన జీవితమే అంటూ కాళ్లు మొక్కడానికి చూశారట.

ALSO READ:Tollywood: కోర్ట్ మూవీ హీరో – హీరోయిన్ కలయికలో మరో మూవీ.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్!

అందుకే స్పెషల్ రూమ్..

కానీ తేజ మాత్రం వద్దు నువ్వు నా కాళ్లు మొక్కాల్సిన పనిలేదు అని చెప్పారట.కానీ మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అని అడగగా.. నా కాళ్లు మొక్కనవసరం లేదు కానీ నువ్వు ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పావు కదా.. నీ ఇంట్లో నాకోసం ఒక స్పెషల్ రూమ్ ని కట్టించు.. ఎందుకంటే నేను కొత్త వాళ్ళందర్నీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఎప్పుడైనా రోడ్డుమీద పడితే.. నీ ఇంట్లో నాకోసం కట్టిన ఆ రూమ్ ఇవ్వు అంటూ సరదాగా చెప్పారట. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సుమన్ శెట్టి నిజంగానే డైరెక్టర్ తేజ కోసం తన కొత్త ఇంట్లో ఒక స్పెషల్ రూమ్ ని కేటాయించి.. అందులో తేజ కి సంబంధించిన ఒక ఫోటో పెట్టి ఆ రూమ్ ని ప్రతిరోజు క్లీన్ చేసేసి సేమ్ ఒక దేవుడి రూమ్ లాగే ఫీల్ అయిపోతుంటారట. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ తేజతో పాటు సుమన్ శెట్టి కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. అలా జీవితంలో ఒకరికి లైఫ్ ఇస్తే వారు తమ కృతజ్ఞతను ఏ విధంగా చూపిస్తారో సుమన్ శెట్టి కూడా తేజ విషయంలో అలాగే వ్యవహరించారట.

Related News

Manchu Lakshmi: ఆమె నా రోల్ మోడల్.. ట్విస్ట్ ఇచ్చిన మంచు లక్ష్మీ!

Manchu Lakshmi: మనోజ్ రీ ఎంట్రీ వెనుక ఇంత కథ ఉందా.. మంచు లక్ష్మీ ఏమన్నారంటే?

Mohini: 7సార్లు ఆత్మహత్యాయత్నం.. ఆయనే కాపాడాడంటూ బాలయ్య హీరోయిన్ ఎమోషనల్!

Good Bad Ugly: అజిత్ ఫ్యాన్స్ కు షాక్.. నెట్ ఫ్లిక్స్ నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ డిలీట్

Mirai Collections : 100 కోట్ల క్లబ్‌లో మిరాయ్… హీరోకు ఒక పోస్టర్.. విలన్‌కి ఓ పోస్టర్..

Tollywood: కోర్ట్ మూవీ హీరో – హీరోయిన్ కలయికలో మరో మూవీ.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్!

Rukmini Vasanth: అతనిపై మనసు పారేసుకున్న రుక్మిణీ వసంత్.. బిగ్గెస్ట్ క్రష్ అంటూ!

Big Stories

×