Flipkart iPhone Offers: ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్‌కి ముందే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ మోడళ్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. సాధారణంగా ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది వెనుకాడుతుంటారు. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన ఆఫర్ వల్ల మంచి ఫీచర్లతో ఉన్న ఐఫోన్లను తక్కువ ధరలోనే పొందే అవకాశం దక్కుతోంది.
ఐఫోన్ 16 (128 జీబీ వైట్)
ముందుగా ఐఫోన్ 16 గురించి చెప్పుకుంటే, దీని అసలు ధర రూ.79,900. కానీ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు కేవలం రూ.51,999కే అందిస్తోంది. అంటే దాదాపు 34శాతం తగ్గింపు. ఇది నిజంగా ఐఫోన్ ప్రియులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఫోన్‌లో 128జిబి స్టోరేజ్ ఉండటం వల్ల ఫైళ్లను, ఫొటోలు, వీడియోలు ఎక్కువ మొత్తంలో సేఫ్‌గా స్టోర్ చేసుకోవచ్చు.
ఇక స్క్రీన్ విషయానికి వస్తే, 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే ఇవ్వబడింది. దీంతో కలర్ క్వాలిటీ, పిక్చర్ క్లారిటీ అద్భుతంగా ఉంటుంది. కెమెరా సెటప్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉంది. వెనుక భాగంలో 48ఎంపి ప్లస్ 12ఎంపి కెమెరాలు ఉండగా, ఫ్రంట్‌లో 12ఎంపి కెమెరా ఉంది. ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
పనితీరు విషయంలో ఎ18 చిప్ ఉంది. ఇది 6 కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. గేమింగ్ అయినా, హెవీ యాప్‌లు అయినా స్మూత్‌గా రన్ అవుతాయి. మొత్తం మీద ఈ ఫోన్ పనితీరు, డిజైన్, కెమెరా అన్ని విషయాల్లోనూ సూపర్ హిట్.
Also Read: Samsung Galaxy: సామ్‌సంగ్ గెలాక్సీ ఎ37 5జి.. మిడ్ రేంజ్‌లో మాస్టర్ ఫోన్
ఐఫోన్ 17 (256 జీబీ మిస్ట్ బ్లూ)
ఇక కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 17 విషయానికి వస్తే, ఇది ప్రీ ఆర్డర్‌లో అందుబాటులో ఉంది. ధర రూ.82,900గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లో అందించే ఫీచర్లు అయితే గత మోడళ్లతో పోలిస్తే మరింత ఆధునికంగా, మెరుగ్గా రూపుదిద్దుకున్నాయి.
6.3 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఉండటం వల్ల విజువల్స్ మరింత క్లియర్‌గా కనిపిస్తాయి. కెమెరా సెటప్‌లో వెనుక భాగంలో 48ఎంపి ప్లస్ 48ఎంపి డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. అంటే నైట్ ఫోటోలు, అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్, 4కె వీడియోలు అన్నీ మరింత ప్రొఫెషనల్‌గా వస్తాయి. ఫ్రంట్ కెమెరా కూడా 18ఎంపితో అద్భుతంగా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ అన్నీ హై క్వాలిటీలో లభిస్తాయి.
ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఎ19 చిప్‌తో వస్తోంది. ఇది మరింత వేగంగా, పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్, వీడియో ఎడిటింగ్ లాంటి పనులు సులభంగా చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్లను పరిమిత కాలం పాటు మాత్రమే అందిస్తోంది. కాబట్టి తక్కుక బడ్జెట్‌తో ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ఈ అవకాశాన్ని వదులుకుంటే మంచి ఛాన్స్ మిస్సైనట్లే. ఐఫోన్ 16ను తక్కువ ధరలో కొనుగోలు చేయాలా? లేకపోతే ఐఫోన్ 17లో కొత్త ఫీచర్లను తీసుకోవాలా? అన్నది పూర్తిగా వినియోగదారుల ఎంపిక, ఇష్టం పై ఆధారపడి ఉంది. కానీ ఇలాంటి భారీ తగ్గింపులు ప్రతి రోజూ రాకపోవచ్చు గుర్తించుకోండి.