Anurag Kashyap:ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నిర్మాతలపై, బాలీవుడ్ డైరెక్టర్ల పై ఊహించని కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. పైగా బాలీవుడ్లో తాను ఉండలేనని ఎన్నోసార్లు కామెంట్లు కూడా చేశారు. అలాంటి ఈయన ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలపై ముఖ్యంగా వార్ 2 నిర్మాతలను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)హిందీ తొలి పరిచయంలో చేసిన చిత్రం ‘వార్ 2’. ఇందులో కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటించింది. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా (Adithya Chopra) భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన అటు రజినీకాంత్ ‘కూలీ’ సినిమాకు పోటీగా విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు ఈ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై, ఆ బ్యానర్ నిర్మాతలపై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక వ్యాఖ్యలు చేశార. అందులో భాగంగానే ట్రయల్ రూమ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతూ ఊహించని కామెంట్లు చేస్తూ నిర్మాణ సంస్థపై అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
కాపీ కొడతారే తప్ప సొంత ఆలోచనలు లేవు..
అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. “బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే చాలా సినిమాలు ట్రయల్ రూమ్ ఎఫెక్ట్ వల్ల నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఇందులో యష్ రాజ్ ఫిలిమ్స్ తో అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది ట్రయల్ రూమ్ ఎఫెక్ట్ మాత్రమే.. వీళ్ళు ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ అనే సినిమాని తీయాలి అనుకుంటారు. కానీ అది విడుదలయ్యాక ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అవుతుంది. అలాగే మరో కథను ఆధారంగా చేసుకొని దాని నుండి ‘మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్’ ని తీయాలనుకుంటారు.కానీ అది విడుదలయ్యాక ‘షంషేరా’ అవుతుంది. రాజమౌళి (Rajamouli) లాంటి డైరెక్టర్ బాహుబలి (Bahubali) సినిమా తీశాక ఆయనలాగే కొంతమంది 10 వెర్షన్ లను తీస్తారు. కానీ ఎన్ని సినిమాలు తీసిన రాజమౌళి లాగా ఉండవు.ఎందుకంటే రాజమౌళి ఒరిజినల్.. అలాగే రాజమౌళిలా సినిమా అయితే తీయగలరు గానీ ఆయన మైండ్ సెట్ ఏంటి? అనేది మాత్రం ఆలోచించలేరు కదా. ఆయన సినిమాని కాపీ చేయొచ్చు కానీ ఆయన ఆలోచనలని కాపీ చేయలేరు కదా . దక్షిణాదిలో ఒక బాహుబలి, కేజీఎఫ్ వంటి సినిమాలు వచ్చాక అదే దారిలో వీళ్లు కూడా సినిమాలు తీస్తున్నారే తప్ప కొత్తదారిని ఎంచుకోరు” అంటూ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే నిర్మాణ సంస్థపై అనురాగ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. మరి దీనిపై నిర్మాణ సంస్థ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
ALSO READ:Manchu Lakshmi: వారికి భయపడే సమంతకు అవకాశాలు ఇవ్వడం లేదు.. మంచు లక్ష్మీ హాట్ కామెంట్స్